ట్యాంకర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి-మహేశ్వరం రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు జామున ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. పొగ మంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనం కనిపించక పోవడంతో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ తరలించారు. మిగతా ఇద్దరికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.