కుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి
Published Thu, Sep 15 2016 1:44 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక మహ్మద్‌నగర్ పక్కన ఉన్న కుంటలో ప్రమాదవశాత్తూ పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. కుంటలో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. వీరంతా మహ్మద్‌నగర్‌కు చెందిన శిల్ప(14), శివ(13), సుజన్(13), బన్నీ(10)లుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సంఘటనాస్థలంలో రోదనలు మిన్నంటుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement