బస్టాండ్‌లోకి దూసుకెళ్లిన ఇన్నోవా | car accident in rangareddy district | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లోకి దూసుకెళ్లిన ఇన్నోవా

Published Sat, Jul 2 2016 1:19 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

car accident in rangareddy district

కందుకూరు: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడే. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు బస్టాండ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి బస్టాండ్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కందుకూరు పశువైద్యాధికారి ప్రసాదరావు(50) మరణించగా, మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement