కందుకూరు (రంగారెడ్డి) : అప్పుల పాలైన ఓ రైతు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో శనివారం జరిగింది. అనేగౌని కృష్ణయ్యగౌడ్(52) తనకున్న పది ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు.
సిండికేట్ బ్యాంక్‌లో రూ.1.90 లక్షల అప్పు ఉంది. కాగా, పంటలు సక్రమంగా పండకపోవడంతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పొలానికి వెళ్లి అక్కడ ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.