
కందుకూరు: దిశ యాప్ ఆపదలో ఉన్న మహిళల పట్ల ఆపద్బాంధవునిగా మారింది. సోమవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కందుకూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దూబగుంట గ్రామం వద్ద ఓ యువతి అనుమానాస్పదంగా తిరుగుతుందని బ్రహ్మయ్య అనే యువకుడు దిశ యాప్‌కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే రూరల్ పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ యువతిని ప్రశ్నించారు. తాను మదనపల్లి నుంచి విజయవాడ వెళ్తూ కందుకూరులో బస్సు దిగానని, ఎటువెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. పోలీసులు.. ఆమెను ఒంగోలులోని సఖి సెంటర్‌కు తరలించి మదనపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment