27 నుంచి పవిత్రోత్సవాలు
Published Sat, Aug 20 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
ద్వారకా తిరుమల : శ్రీవారి ఆలయ ఉపాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని దివ్య పవిత్రోత్సవాలు ఈ నెల 27 నుంచి 30 వరకు జరగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. 27న అంకురార్పణ, 28న పవిత్రాదివాసము, 29న పవిత్రారోహణ, 29న పవిత్ర అవరోహణ నిర్వహించనున్నట్టు ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు.
Advertisement
Advertisement