సాక్షి, పశ్చిమ గోదావరి : హిందూ సంప్రదాయాలను కాపాడుతూ ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికి దేవుడి ఆశీస్సులు అందించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారకా తిరుమల నూతన పాలకమండలిని ఏర్పాటు చేశారని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని తెలిపారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థాన నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది. 16 మంది సభ్యులతో దేవస్థాన పాలక మండలి ఏర్పాటైంది. పాలకమండలి సభ్యులతో ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమంలో ఎంపీ మార్గాన్ని భరత్, ఎమ్మెల్యేలు పుప్పాలా వాసు, బాబు తలారి వెంకట్రావు, పాలక మండలి ఆలయ ఛైర్మన్ యస్.వి. సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్.. ట్రస్ట్ బోర్డులో బడుగు, బలహీన వర్గాల వారితో పాటు మధ్యతరగతి వారికి చోటు కల్పించారని తెలిపారు. ట్రస్ట్ బోర్డులో మెంబర్‌గా ఉన్నవారు కొంత సమయం కేటాయించి దేవుడికి సేవ చేయడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ద్వారకా తిరుమల దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment