శ్రీవారి అనివెట్టి మండపంలో భోగి పిడకలను భక్తురాలికి విక్రయిస్తున్న సిబ్బంది
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భోగి పిడకల విక్రయాలను ఆదివారం ప్రారంభించారు. స్వామి గోసంరక్షణ శాలలోని గోవుల ద్వారా వచ్చే పేడతో ఈ పిడకలను తయారు చేస్తున్నారు. ధనుర్మాసం ప్రారంభం కావడంతో కొత్తగా వీటి విక్రయాలను దేవస్థానం ప్రారంభించింది. 25 భోగి పిడకల ధరను రూ.100గా నిర్ణయించి, స్థానిక అనివెట్టి మండపంలో ఆలయ సిబ్బంది అమ్ముతున్నారు. ఈ పిడకలను భోగి పండుగ నాడు వెలిగించే, భోగి మంటల్లో వేస్తే అంతా మంచి జరుగుతుందని ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment