venkanna temple
-
నందమూరు వెంకన్న.. నీవే దిక్కన్నా..
సాక్షి, తాడేపల్లిగూడెం: ఏడుకొండలవాడా.. వేంకటరమణా.. ఆపద్బాంధవా.. అనాథ రక్షకా.. గోవిందా.. గోవిందా.. అంటూ నందమూరు వెంకన్నకు నీరాజనాలు అర్పించకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికల వేళ రాజకీయ నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టరు. ఏ పార్టీ అభ్యర్థి అయినా మండలంలోని నందమూరు వెంకన్నను దర్శించుకుంటారు. స్వామి దర్శనం విజయం కలిగిస్తుందని ఆశావహుల విశ్వాసం. భౌగోళికంగా, వాస్తురీత్యా చూసినా నియోజకవర్గానికి ఈ గ్రామం తూర్పు దిశలో ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు 300 వందల ఏళ్ల నాటి గన్నేరు పూల చెట్టు ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే తాళపత్రాల గ్రంథాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు ఇక్కడి వారే. సత్తుపల్లికి మకాం మార్చినా స్వామిపై విశ్వాసంతో ఖమ్మం జిల్లానుంచి ఏటా ఒక్కసారైనా వచ్చి స్వామిని దర్శించుకునే వారు. అదే ఆనవాయితీని ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. రాజకీయంగా ఇది సెంటిమెంటుగా మారింది. ప్రచార పర్వంలో అభ్యర్థులు ఈ ఆలయానికి క్యూ కట్టడం విశేషం. -
వెంకన్న ఆలయంలో భోగిపిడకల విక్రయం
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భోగి పిడకల విక్రయాలను ఆదివారం ప్రారంభించారు. స్వామి గోసంరక్షణ శాలలోని గోవుల ద్వారా వచ్చే పేడతో ఈ పిడకలను తయారు చేస్తున్నారు. ధనుర్మాసం ప్రారంభం కావడంతో కొత్తగా వీటి విక్రయాలను దేవస్థానం ప్రారంభించింది. 25 భోగి పిడకల ధరను రూ.100గా నిర్ణయించి, స్థానిక అనివెట్టి మండపంలో ఆలయ సిబ్బంది అమ్ముతున్నారు. ఈ పిడకలను భోగి పండుగ నాడు వెలిగించే, భోగి మంటల్లో వేస్తే అంతా మంచి జరుగుతుందని ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు తెలిపారు. -
వెంకన్న ఆలయంలో చోరీ
- తాళాలు పగులగొట్టి హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు రొళ్ల : మండల పరిధిలోని కొత్తపాళ్యం గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి హుండీలను ఎత్తుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఆలయ అర్చకుడు, దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజు సోదరుడు ప్రకాష్ ఆలయ తాళాలను తెరచి చూడగా ఉత్తరద్వారం వైపున ఉన్న వాకిలి తాళాలను పగులగొట్టి పెద్ద హుండీని ఆలయ వెనుకభాగంలోకి తీసుకెళ్లారు. శ్రీదేవి, గోదాదేవి ఆలయాల్లో తాళాలు పగులగొట్టి హుండీలను సమీపంలోని పొలాల్లోకి విసిరేశారు. సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించడంతో ఎస్ఐ నాగన్న సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అనంతపురం నుంచి క్లూస్‌టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. గత ఏడాది జూన్ నుంచి డిసెంబరు వరకు రూ.2.80లక్షల వరకు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి దాకాహుండీ తాళాలు తెరవలేదన్నారు. ఆ మొత్తాన్ని అపరించుకుని వెళ్లారన్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజులు సోదరుడు ప్రకాష్ రూ.40వేలు చోరీ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వెంకన్న హుండీ ఆదాయం రూ.7.30 లక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : స్థానిక రామచంద్రరావు పేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీని శుక్రవారం లెక్కించగా రూ.7,30,951 ఆదాయం సమకూరింది. 73 రోజులకు గాను ఈ ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బీహెచ్‌వీఎస్‌ఎన్ కిశోర్‌కుమార్ తెలిపారు. ఒక అజ్ఞాత భక్తుడు రూ.500 నోట్ల కట్టను(రూ.50 వేలు)స్వామి వారికి సమర్పించినట్టు లెక్కింపులో గుర్తించారు. ఈఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ శలా మాణిక్యాలరావు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ తిరుపతి
-
కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యం
∙‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ రాజు ∙ఆత్రేయపురం వెంకన్నకు పూజలు ఆత్రేయపురం: (కొత్తపేట) : కుటుంబ కథా చిత్రాలకే అధిక ప్రాధాన్యమి స్తానని శతమానం భవతి సినిమా డైరెక్టర్ వేగేశ్న సతీష్‌రాజు అన్నారు. మంగళవారం ఆయన ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లమ్మ, కనక మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాల్లో కుంకుమ పూజలు చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకూ 45 చిత్రాలకు కథ, మాటలు రాసి, స్క్రీ¯ŒS ప్లే చిత్రీకరించడంతో పాటు డైరెక్టర్‌గా శతమానం భవతి మంచి హిట్‌ను అందించడంతో సతీష్రాజును క్షత్రియ యూత్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్రేయపురంతో ఎంతో ఆత్మీయబంధం ఉందన్నారు. అందుకే శతమానం భవతి సినిమాలో ఆత్రేయపురం పేరుతో సినిమా రూపొందించడం సెంట్‌మెంట్‌గా భావిస్తున్నానని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఓడూరు తన స్వగ్రామమని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ కథా చిత్రాలపై దృష్టి సారించానని తెలిపారు. ప్రస్తుతం దిల్‌రాజ్ నిర్మాణంలో ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నామని తెలిపారు. ఆలయంలో ఘన స్వాగతం.. శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన సతీష్ రాజుకు నిర్మాత పాతపాటి సత్యనారాయణరాజు (రమణరాజు) ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని, స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. వేదపండితులు ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వామి వారి ఫొటోను ఆలయ నిర్మాత రమణరాజు ఆయనకు అందజేశారు. అనంతరం గ్రామంలో ‘వేగేశ్న’ వారి ఇంట్లో భోజనం చేసి, బంధుమిత్రులతో కాలక్షేపం చేశారు. సతీష్ రాకతో ఆయన అభిమానులు తరలివచ్చి ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు. విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు అయినవిల్లి : విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వేగేశ్న సతీష్ మంగళవారం పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రధానార్చకుడు సూరిబాబు, చైర్మ¯ŒS సుబ్బరాజు స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. -
వైభవంగా సామూహిక వ్రతాలు
కాళ్ల : గ్రామంలోని స్వయంభూ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సుమారు 450 మంది పాల్గొని స్వామివారి వ్రతాలు ఆచరించారు. తాడినాడ గ్రామానికి చెందిన వేగేశ్న వెంకట సూర్య సత్యనారాయణ రాజు– సూర్య లక్ష్మి దంపతులు వ్రతాల్లో పాల్గొన్న వారికి అన్నవరం స్వామివారి ప్రసాదం, ప్రతిమ అందజేశారు. గూట్లపాడుకు చెందిన ఆరేటి సత్యనారాయణ, నాగ పుష్పావతి ప్రసాద వినియోగం ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ అడ్డాల వెంకట గణపతిరాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
విశాఖలో తిరుమల వెంకన్న
ఎండాడలో భారీ ఆలయ నిర్మాణం 10 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం సాక్షి, విశాఖపట్నం: విశాఖలో తిరుమల వెంకన్న కొలువుదీరనున్నాడు. ఏడుకొండలవాడు ఎండాడలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నాడు. నగరంలో తిరుమల తరహాలో వేంకటేశ్వరుని ఆలయం నిర్మాణానికి సర్కారు సూ త్రప్రాయంగా అంగీకరించింది. తిరుమల వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం కోసం బుధవారం విశాఖ శివారులోని ఎండాడ సర్వే నంబరు 20పి, 191పిలో 10 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నంబరు 829ను జారీ చేసింది. ఈ భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వాధీనం చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేసీ శర్మ జీవోలో పేర్కొన్నారు. ఇందుకవసరమయ్యే నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే అవకాశం ఉంది. వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం పూర్తయితే తిరుమలలో మాదిరిగానే పూజలు, సేవలు, ఇతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం భూమి కేటాయించడంతో సత్వరమే దివ్యక్షేత్రం పనులు మొదలై చకచకా పూర్తవుతాయని వెంకన్న భక్తులు ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే విశాఖ ఎంవీపీ కాలనీలో టీటీడీ కల్యాణ మండపం, దానికి ఎదురుగా టీటీడీ వారి ఈ–దర్శనం కౌంటరు ఉన్నాయి. రెండేళ్ల క్రితం నేరుగా తిరుమల నుంచి వెంకన్న లడ్డూలను కూడా రప్పించి ఒక్కొక్కటి రూ.25ల చొప్పున భక్తులకు అందజేసేవారు. కొన్నాళ్ల తర్వాత వాటి పంపిణీని నిలిపివేశారు. టీటీడీ దివ్యక్షేత్రం పూర్తయితే వేంకటేశ్వరుని దివ్యదర్శనం, స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి వస్తాయి. -
‘నృత్య’ నూతనం
అన్నవరప్పాడు (పెరవలి) : నాటకం, పౌరాణిక సినిమాల్లో కనిపించే దృశ్యాలను నృత్యంలోనూ ఆవిష్కరించారు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణుడు ర«థం నడపడం, గోపికలతో గోపాలుడి నృత్యం, అర్జునుడికి గీతా బోధన, అష్టలక్ష్మిల అవతారం, మహాకాళి అగ్రహం వంటి దృశ్యాలను నృత్యంలో ఆవిష్కరించారు. రింగ్‌తో చేసిన నృత్యాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. ఇలా తమ నృత్యంతో ఆహూతులను అలరించారు నాట్యకారిణి జవ్వాది అంబిక, శిష్య బృందం. పెరవలి మండలం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది. తణుకు దగ్గర పైడిపర్రు గ్రామానికి చెందిన అంబిక అంతర్జాతీయస్థాయిలో ప్రసిద్ధి గాంచిన నాట్యకారిణి. దేశ, విదేశాల్లో వందల ప్రదర్శనలు ఇచ్చారు. అన్నవరప్పాడు తాతగారి ఊరు కావటంతో ఆమె తన శిష్య బృందంతో వచ్చి ప్రదర్శన ఇచ్చారు. -
స్వామీ.. ఇది ఏమి?
ఉపమాక వెంకన్న ఆలయ బకాయిలు చెల్లించని టీటీడీ సిబ్బంది జీతాలకూ అదే పరిస్థితి నక్కపల్లి: ఉపమాక వెంకన్న ఆలయంలో అర్చకులు, సిబ్బందికి బకాయి వేతనాలను టీటీడీ ఇప్పటికీ చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఆలయ ఆస్తులు, సిబ్బంది, నిర్వహణ టీటీడీ పరిధిలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచాయి. గత ఏడాది నవంబరు 18న ఉపమాక వెంకన్న ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంది. అప్పటికి ఆలయ నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, స్వామివారి కైంకర్యాల నిర్వహణ కోసం దేవాదాయశాఖ చెల్లించాల్సిన బకాయిల వివరాలను ఆలయ ఈవో శేఖర్ టీటీడీ అధికారులకు అందజే శారు. వేతనాల్లో కోత సెక్యూరిటీ గార్డులకు 4నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంది. పాత బకాయిలు చెల్లించకపోగా సిబ్బంది జీతాల్లోంచి కోత విధిస్తున్నారంటూ సిబ్బంది వాపోయారు. ఆలయంలో అర్చకుడు, జూనియర్ అసిస్టెంట్, , ఇద్దరు సన్నాయిమేళం సిబ్బంది రెగ్యులర్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరు టీటీడీ ఉద్యోగులుగా పరిగణనలోకి వస్తారు. అర్చకుడి జీతం నుంచి నెలకు రూ.3,500, గుమస్తాజీతం నుంచి 4వేలు, సన్నాయిమేళం వారి నుంచి రూ.1500 చొప్పున కోత విధించి చెల్లిస్తున్నారని, ఇలా దేనికి తగ్గిస్తున్నారో చెప్పడం లేదని వారు తెలిపారు. కనీస వేతనాలు కరువు టీటీడీ పరిధిలో సిబ్బందికి రెగ్యులర్ అయినా, కాకపోయినా కనీస వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ టీటీడీ నిబంధనలు అమలు కావడంలేదు. ఎన్‌ఎంఆర్‌లుగా అర్చకుడు, వంటస్వామి, అన్నదానం వంటస్వామి, పోటు సహాయకుడు, ముగ్గురు స్వీపర్లు, ముగ్గురు భజంత్రీలు, వాచ్గార్డు, అటెండరు, గోవుల కాపరి పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు చెల్లించడం లేదు. టీటీడీ స్వాధీనం చేసుక్ను తర్వాత నియమించిన ఇద్దరు సిబ్బందికి కనీస వేతనాలు చెల్లిస్తున్నా దేవాదాయశాఖ నుంచి టీటీడీ పరిధిలోకి వచ్చినవారికి మాత్రం అరకొర వేతనాలే చెల్లిస్తున్నారు. ఆలయాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటే తమకు వేతనాలు బాగుంటాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఈ విషయమై ఇన్స్పెక్టర్ శర్మను వివరణ కోరగా ఈ వ్యవహారం తన పరిధిలోనిది కాదని, జేఈవో, ఈవోలే చూడాలన్నారు. బకాయిలివీ అర్చకులు, సన్నాయి మేళం, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.6.24లక్షల బకాయిలు చెల్లించాలి. స్వామి వారి నివేదన కోసం కొనుగోలు చేసిన బియ్యానికి రూ.1.32లక్షలు, కిరాణా సరకులకు రూ.1.68లక్షలు, గ్యాస్‌కు రూ.74వేలు చెల్లించాల్సి ఉంది. స్వామివారి నిత్య అలంకరణకు ఉపయోగించే చీర, ధోవతి, కండువాల కోసం అనకాపల్లి గుంటూరు చేనేత వస్త్రాలయం వారికి రూ.59వేలు, కల్యాణోత్సవాల్లో ఆలయానికి వేసిన రంగుల కోసం రూ.23వేలు, స్వామికి అలంకరించిన పూలమాలల కోసం రూ.420 బకాయిలున్నాయి. వెర సి సుమారు రూ.11లక్షల వరకు బకాయిలు చెల్లించాలి.