వెంకన్న హుండీ ఆదాయం రూ.7.30 లక్షలు | venkanna hundi income rs.7.30 laks | Sakshi
Sakshi News home page

వెంకన్న హుండీ ఆదాయం రూ.7.30 లక్షలు

Published Fri, Jun 9 2017 7:23 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

venkanna hundi income rs.7.30 laks

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : స్థానిక రామచంద్రరావు పేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీని శుక్రవారం లెక్కించగా రూ.7,30,951 ఆదాయం సమకూరింది. 73 రోజులకు గాను ఈ ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి బీహెచ్‌వీఎస్‌ఎన్‌ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఒక అజ్ఞాత భక్తుడు రూ.500 నోట్ల కట్టను(రూ.50 వేలు)స్వామి వారికి సమర్పించినట్టు లెక్కింపులో గుర్తించారు. ఈఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ శలా మాణిక్యాలరావు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement