నేడు ‘పరిషత్’ కౌంటింగ్
ఏలూరు, న్యూస్‌లైన్ : మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఏమిటనేది మరికొద్ది గంటల్లోనే వెల్లడి కానుంది. 46 జెడ్పీటీసీ, 865 ఎంపీటీసీ పదవులకు రెండు విడతలుగా ఏప్రిల్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించగా, మంగళవారం లెక్కింపు చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యూయి. ఉదయం 8 గంటలకే బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులు, రాజకీయ పక్షాల సమక్షంలో తెరుస్తారు. బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను పాతిక చొప్పున కట్టలుగా కడతారు. అనంతరం కట్టల్లోని బ్యాలెట్ పేపర్లను ఒక్కొక్కటిగా తెరిచి, అందులో ఓటు ఏ అభ్యర్థికి నమోదైందనే విషయూన్ని గుర్తించి అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ఏలూరు నగరంతోతో ఐదు ప్రధాన ప్రాంతాల్లోని 10 కౌంటి ంగ్ కేంద్రాల వద్ద 46 మండలాల ఫలితాలను తేల్చేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
నెల రోజుల అనంతరం..
జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ పోలింగ్ పూర్తయిన నెల రోజుల తర్వాత కౌంటింగ్ చేపడుతున్నారు. గత నెల 6న తొలివిడతగా ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని 22 మండలాల్లో 22 జెడ్పీటీసీ, 413 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. రెండో విడతగా ఏప్రిల్ 11న నరసాపురం, కొవ్వూరు డివిజన్ల పరిధిలోని 24 మండలాల్లో 24 జెడ్పీటీసీ, 452 ఎంపీటీసీ పదవులకు పోలింగ్ జరిపారు. 46 జెడ్పీటీసీ పదవులకు 152 మంది, 865 ఎంపీటీసీ పదవులకు 2,180 మంది కలిపి మొత్తం 2,332 మంది పోటీపడ్డారు. రెండు విడతల్లో మొత్తంగా 84 శాతం సగటు పోలింగ్ నమోదైంది. 20 లక్షలకు పైగా గ్రామీణులు ఓటేశారు. ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశంజెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయూనికి మంగ ళవారం అర్ధరాత్రి దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత అనుభవాలను బట్టిచూస్తే కొన్ని మండలాల్లో మరుసటి రోజున కూడా కౌంటింగ్ చేసిన సందర్భాలు ఉన్నారుు. ఈసారి కూడా జెడ్పీటీసీ ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం లేకపోలేదు.