
సాక్షి, పశ్చిమ గోదావరి : జూన్ 21న సూర్య గ్రహణం సందర్భంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 20వ తేదీన రాత్రి యధావిధిగా ఆలయం మూసివేసి 21వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు మళ్లీ ఆలయం తెరిచి సంప్రోక్షణ నిర్వహించి శుద్ది జరుపుతారని అధికారులు పేర్కొన్నారు. అనంతరం రాత్రి 7గంటలకు భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు. కాగా సూర్య గ్రహణం సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.