
బాటిల్లో దూరి పడగవిప్పిన తాచుపాము పిల్ల
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ తూర్పు ప్రాంతంలోని జంటగోపురాల వద్ద శుక్రవారం ఉదయం తాచుపాము పిల్ల కొద్దిసేపు హల్‌చల్ చేసింది. అక్కడ పడి ఉన్న ఒక వాటర్ బాటిల్‌లోకి దూరిన ఆ పాము పిల్ల బయటకొచ్చేందుకు అష్టకష్టాలు పడుతూ.. పడగ విప్పి చూడటం మొదలు పెట్టింది. అంత చిన్న పాము పిల్ల పడగ విప్పి చూస్తుండటాన్ని అక్కడున్న భక్తులంతా ఆసక్తిగా తిలకించారు. ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక హోంగార్డు ధైర్యం చేసి ఆ బాటిల్‌కు మూతపెట్టి, పాము పిల్లను బందీ చేశాడు. అనంతరం కొండపైకి దూరంగా తీసుకెళ్లి పొదల్లో విడిచిపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment