
సాక్షి, బెంగళూరు : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆలయాల సందర్శానార్థం మంగళవారం ఆయన మంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ...‘ 2014 ఎన్నికల్లో వచ్చిన ఫలితమే ఇప్పుడు కూడా వస్తుందనే నమ్మకం ఉంది. బీజేపీ 300కు పైగా సీట్లు సాధిస్తుంది. మరోసారి నా సోదరుడు నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు’అని ధీమా వ్యక్తం చేశారు.
ఎటువంటి మ్యాజిక్ జరుగబోదు
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నాలుగన్నరేళ్లుగా ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రహ్లాద్ మోదీ అన్నారు. విపక్షాల కూటమి విజయవంతం కాదని జోస్యం చెప్పారు. ఇక ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రం గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఆమె రాకతో కాంగ్రెస్‌లో ఎటువంటి మ్యాజిక్ జరుగబోదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment