PM Modi Brother Prahlad Modi And Family Injured In Car Accident Near Mysuru - Sakshi
Sakshi News home page

Prahlad Modi: రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడి కుటుంబానికి గాయాలు

Published Tue, Dec 27 2022 4:53 PM | Last Updated on Tue, Dec 27 2022 5:07 PM

PM Modi Brother Prahlad Modi Injured In Car Accident Near Mysuru - Sakshi

బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ కుటుంబ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూర్‌ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ప్రహ్లాద్‌ మోదీతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనుమడు ఉన్నారు. ఈ ప్రమాదంలో మోదీ మనుమడి కాలుకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలతో బయటపడిన మోదీ కుటుంబ సభ్యులను మైసూర్‌లోని జేఎస్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ప్రహ్లాద్‌ మోదీ తన కుటుంబంతో కలిసి మెర్సిడేస్‌ బెంజ్‌ కార్‌లో బందిపురాకు వెళ్తుండగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కాన్వాయ్‌ సైతం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement