జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి | Jammu And Kashmir Road Accident: Several Deceased Injured Pm Modi Announces Ex gratia | Sakshi
Sakshi News home page

Jammu And Kashmir: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

Published Thu, Oct 28 2021 11:59 AM | Last Updated on Fri, Oct 29 2021 2:39 PM

Jammu And Kashmir Road Accident: Several Deceased Injured Pm Modi Announces Ex gratia - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 

మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఒక్కొక్కరికి ₹ 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పీఎంఓ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొంది.

చదవండి: Covid-19: టీకా తీసుకున్నా, రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement