హైదరాబాద్‌లో కరెన్సీ సమస్య లేదు!
హైదరాబాద్‌లో కరెన్సీ సమస్య లేదు!
Published Sat, Nov 26 2016 10:55 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కూడా హైదరాబాద్‌లో ఎక్కడా కరెన్సీ సమస్య ఉన్నట్లు లేదని అన్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇక్కడ ఎవరిని చూసినా చాలా సంతోషంగా కనపడుతున్నారని, దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ కరెన్సీ సమస్య ఏమీ ఉన్నట్లుగా లేదని ప్రహ్లాద్ మోదీ అన్నారు.
ఇంతకు ముందు కూడా ఆయన కొన్ని విషయాల్లో చేసిన వ్యాఖ్యలు కొంత విచిత్రంగానే ఉన్నాయి. సుమారు వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు అక్కడి 'తేలి' (నూనెతీసే వాళ్లు) కులం వాళ్లను.. పేర్ల తర్వాత మోదీ అని ఎందుకు పెట్టుకోవడం లేదని అడిగారు. నరేంద్రమోదీ దేశంతో పాటు తమ కులానికి కూడా గర్వకారణమని అక్కడివాళ్లు చెప్పడంతో.. ఆయన ఈ మాట అన్నారు. కర్మదేవి అనే దేవత తేలి కులానికి చెందినవారేనని, మనమంతా ఆమె బిడ్డలమేనని చెప్పారు.
Advertisement
Advertisement