చౌదరిగూడలో ప్రధాని తమ్ముడు
మొక్కనాటి గ్రామస్తులతో ప్రహ్లాద్ మోదీ మాటామంతి
ఘట్‌కేసర్: అఖిల భారత రేషన్ డీలర్ల సంఘం సీనియర్ ఉపాధ్యక్షుడు, ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ బుధవారం ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ గ్రామాన్ని సందర్శించారు. హైదరాబాద్‌లో జరిగే రేషన్ డీలర్ల సంఘ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన యాదగిరిగుట్టలో లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో డీలర్ల సంఘం రాష్ట్ర నాయకుడు బాలగోని శ్రీనివాస్ గౌడ్ ఆహ్వానం మేరకు చౌదరిగూడకి వచ్చారు.
గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోమొక్క నాటి గ్రామపంచాయతీ పాలక వర్గంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కమీషన్ కాకుండా వేతనాలు ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరనున్నట్లు చెప్పారు. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు ప్రధాని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయనకు డీలర్ల సంఘం నాయకులు, పంచాయతీ వార్డు సభ్యులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో డీలర్ల సంఘ అధ్యక్షుడు జ్యోతిధర్‌సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టప్ప, ఉపాధ్యక్షుడు కాశం కృష్ణమూర్తి, కోశాధికారి కిరణ్‌పాల్‌సింగ్, సర్పంచ్ నక్కవరలక్ష్మి, ఉపసర్పంచ్ బైరులక్ష్మణ్, వార్డు సభ్యులు బాలగోని శ్రీనివాస్‌గౌడ్, పాలడుగు సురేందర్‌రెడ్డి, శంకర్, పద్మావతి, పులికంటి రాజశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బండగూడెం నాగేష్, రాజు పాల్గొన్నారు.