‘తేలి’ కులస్తులంతా తమ పేర్లకు ముందు ‘మోదీ’ అని చేర్చుకోవాలని ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ పిలుపునిచ్చారు.
భోపాల్: ‘తేలి’ కులస్తులంతా తమ పేర్లకు ముందు ‘మోదీ’ అని చేర్చుకోవాలని ప్రధాని మోదీ తమ్ముడు ప్రహ్లాద్ పిలుపునిచ్చారు. భోపాల్‌లో జరిగిన ‘సాహు’ కులస్తుల అఖిల భారత యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తేలి కులాన్ని నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం సాహు, చౌహాన్, పర్మార్, రాథోడ్, జైస్వాల్ లాంటి ఉపకులాలుగా విభజించారన్నారు.
కర్మాదేవి దేవత తేలి కులస్తురాలనీ, మనమంతా ఆమె పిల్లలమన్నారు. తేలి కులస్తులు మోదీని పేర్లలో చేర్చుకుని మళ్లీ ఐక్యం అయితే దేశంలో వారి జనాభా 14 కోట్లకు చేరుతుంది అని ఆయన అన్నారు.