న్యూఢిల్లీ: ఎన్నికల ఫలితాల వెల్లడికి మరికొన్ని గంటల సమయం ఉన్నా.. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో మాత్రం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇప్పటికే విజేతగా నిలిచారు. ట్వీట్ల విషయంలో ఆయన ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఓ అమెరికా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్విట్టర్‌లో మోడీకి సంబంధించి కోటీ 11 లక్షల ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. ఇవి మొత్తం ట్వీట్లలోనే 20శాతం. దేశంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ట్విట్టర్‌లో ఇప్పటివరకూ 5 కోట్ల 60 లక్షల ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. వీటిలో 82 లక్షల (15%) ట్వీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ, 60 లక్షల(11%) ట్వీట్లతో బీజేపీ రెండు, మూడో స్థానంలో నిలిచా యి. కేజ్రీవాల్ 50 లక్షల (9%) ట్వీట్లు, కాంగ్రెస్ 27 లక్షలు (5శాతం), రాహుల్‌గాంధీ 13 లక్షల (2%) ట్వీట్లతో టాప్ టెన్‌లో నిలిచారు.
మా అన్నయ్యే కాబోయే పీఎం!
అహ్మదాబాద్: ‘మా కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంది. మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సామాన్యుడైన ఒక వ్యక్తి దేశ ప్రధాని కాబోతున్నాడు. నరేంద్రమోడీనే విజేత అంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న విషయాలను పక్కనపెడితే.. మోడీకి ప్రజల నుంచి లభిస్తున్న అద్భుతమైన ఆదరణను నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే ఆయన విజయంపై మాకు అంత నమ్మకం ఉంది’ అంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ గురువారం హర్షాతిరేకాలతో వ్యాఖ్యానించారు. ఇకపై తమ కుటుంబానికి మోడీపై ఎలాంటి హక్కు ఉండబోదని తాము భావిస్తున్నామన్నారు. ‘మోడీ జీవితం దేశానికే అంకితం. భారతదేశ ప్రజలకే ఆయనపై హక్కు ఉంది’ అన్నారు.
ట్విట్టర్ విజేత.. నరేంద్ర మోడీ..!
Published Fri, May 16 2014 1:01 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement