![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/27/8889.jpg.webp?itok=_KR-oFVx)
భద్రాద్రి: నవమాసాలు మోసి కనిపెంచిన కుమార్తెకు వచ్చిన కష్టాన్ని చూసి కిడ్నీని దానం చేసిన ఆ తల్లి త్యాగం వృథాగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సుజాతనగర్‌కు చెందిన బోడా హరినాయక్, భద్రమ్మ దంపతులకు చెందిన పెద్ద కుమార్తె స్నేహిత (13) గత ఏడాది అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో చిన్నారి రెండు కిడ్నీలు చెడిపోయాయి. ఆ సమయంలో కుమార్తెకు వచ్చిన కష్టాన్ని చూసి తల్లి హృదయం తల్లడిల్లింది.
రెండు కిడ్నీలు ఫెయిలై మరణపు అంచుల వద్ద ఉన్న తన కూతురికి తన కిడ్నీనే దానంగా ఇచ్చి పునర్జన్మ ప్రసాదించింది. కిడ్నీ దానంతో చిన్నారి కోలుకోగా తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. కానీ, ఆ సంబురం వారికి కొంతకాలం పాటే నిలిచింది. కిడ్నీ దానం అనంతరం అప్పుడప్పుడు చిన్నారి మళ్లీ అనారోగ్యానికి గురికాగా వైద్యం చేయిస్తూ వస్తున్నారు. పరిస్థితి విషమించిన చిన్నారి వారి ఆశలను అడియాసలను చేస్తూ సోమవారం మృతి చెందింది. కూతురు బతుకుతుందనుకున్న వారి కోరిక తీరకపోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment