బీజింగ్ : వెన్నునొప్పి వచ్చిందని హాస్పిటల్‌కు వెళ్లిన ఓ 56 ఏళ్ల మహిళకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం డాక్టర్లు షాకయ్యారు. ఆమె కిడ్నీలో వేల సంఖ్యలో రాళ్లు ఉన్నాయని చెప్పడంతో మహిళా పేషెంట్ సైతం కంగుతిన్నారు. ఈ ఘటన చైనాలోని జియాంగ్జు హాస్పిటల్‌లో జరిగింది.
షాంగైకి చెందిన మహిళ ఝాంగ్(56)కు గత కొంతకాలం నుంచి వెన్నునొప్పి బాధిస్తోంది. జ్వరంతో పాటు వెన్నునొప్పికి ట్రీట్‌మెంట్ కోసం చంగ్జౌలోని వుజిన్ హాస్పిటల్‌కు వెళ్లిన మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాకయ్యారు. కుడి మూత్రపిండంలో(రైట్ కిడ్నీ) వేల సంఖ్యలో రాళ్లున్నాయని గుర్తించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు దాదాపు 3000 రాళ్లను తొలగించేశారు. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదిస్తే ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవని వైద్యులు సూచించారు.
అయితే కిడ్నీలో రాళ్లు వచ్చిన పేషెంట్లలో భారతీయుడిదే ఆల్ టైమ్ రికార్డ్ అన్న విషయం తెలిసిందే. గిన్నిస్ రికార్డుల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ధన్‌రాజ్ వాడిలే కిడ్నీ నుంచి రికార్డు స్థాయిలో 1,72,155 రాళ్లను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment