న్యూఢిల్లీ: అత్త అంటే కోడలికి గయ్యాళి. వేధించేకుతినే రకం. అందుకే అత్తాకోడళ్లకు సరిపడదు. చాలా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను చూసుంటారు. అయితే తల్లీకూతుళ్ల మాదిరిగా ఉండే అత్తాకోడళ్లు కూడా ఉంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురును కాపాడేందుకు తల్లి చివరి నిమిషంలో నిరాకరించగా.. అత్త అవయదానం చేసి కోడలికి పునర్జన్మ ప్రసాదించింది. ఇది సినిమా కథ కాదు. ఢిల్లీలో జరిగిన మానవీయ వాస్తవ సంఘటన.
పశ్చిమఢిల్లీకి చెందిన కవిత (36) కిడ్నీలు పాడయ్యాయి. దీంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని వైద్యులు సూచించారు. కవిత తల్లి తన కిడ్నీల్లో ఒకటి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకు ఆపరేషన్ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో కిడ్నీ ఇచ్చేందుకు కవిత తల్లి నిరాకరించారు. దీంతో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కవిత ప్రాణాలు దక్కాలంటే కిడ్నీ మార్చడం తప్పనిసరి. ఇలాంటి సమయంలో కవితకు కిడ్నీ ఇచ్చేందుకు ఆమె అత్త విమల ముందుకొచ్చారు. ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కవిత క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. అత్తాకోడళ్ల బంధం అందరికీ ఆదర్శనీయంగా నిలిచింది.
అమ్మ కాదంది.. అత్త ప్రాణదానం చేసింది
Published Fri, Jul 3 2015 7:12 PM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement
Advertisement