రాయ్‌పూర్: అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తుంది రాఖీ పౌర్ణమి. సంతోషంగా జీవతాంతం కలిసి ఉండాలని కోరుకుంటూ అన్నదమ్ముల్లకు ఆడపిల్లలు రాఖీ కడుతారు. వారి రక్షణ ఎప్పుడూ తనకు ఉండాలని కోరుకుంటారు. పండగపూట సోదరి కళ్లలో ఆనందం చూడటానికి ఓ మంచి గిఫ్ట్‌తో అన్నాదమ్ముళ్లు సర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయితే.. చత్తీస్‌గఢ్‌లో మాత్రం ఓ సోదరి తమ్ముడి మీద ప్రేమతో ఓ కిడ్నీనే దానంగా ఇస్తోంది.
ఓం ప్రకాశ్(48), ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌వాసి. గత ఏడాది మే నెల నుంచే అతను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఓ కిడ‍్నీ 80 శాతం, మరో కిడ్నీ 90 శాతం వ్యాధి బారినపడ్డాయి. డయాలసిస్‌తో కాలం వెల్లదీస్తున్నాడు. అనేక ఆస్పత్రులకు తిరిగిన అనంతరం కిడ్నీ మార్పిడికి కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు.
దీంతో కిడ్నీదాత కావాలని డాక్టర్లు చెప్పారు. దీంతో తమ్ముడి కోసం ఓం ప్రకాశ్ పెద్ద అక్క శీలాభాయ్ పాల్ ముందుకు వచ్చింది. రాయ్‌పూర్‌లోని టిక్రపారలో ఉంటున్న ఆమె తమ్ముడి సమస్య తెలిసి వెంటనే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. పరీక్షల అనంతరం ఆమె కిడ్నీ ఓం ప్రకాశ్‌కు సెట్ అవుతుందని డాక్టర్లు తెలిపారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆపరేషన్ జరనుంది.
తమ్ముడంటే ప్రేమ అని తెలిపిన శీలాభాయ్.. అతనితో కలిసి జీవితాంతం బతకాలని కోరుకుంటున్నానని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు ఇంకా మూడు రోజులు ఉండగా.. నేడు శీలాభాయ్ తన తమ్ముడు ఓం ప్రకాశ్‌కి రాఖీ కట్టింది. తన తమ్ముడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించింది.
ఇదీ చదవండి: Raksha Bandhan 2023 Special: ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు? ఆ టైంలోనే రాఖీ కట్టాలా!
Comments
Please login to add a commentAdd a comment