కనిగిరికి చెందిన కిడ్నీ బాధితులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు.
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కిడ్నీ బాధితులు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఆరోగ్య శ్రీ ఉన్నా ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయడం లేదని వైఎస్ జగన్ ముందు బాధితులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కోసారి రూ. 4వేలు ఖర్చవుతోందని ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు.
ఈనెల 20 వ తేదీన కనిగిరి, పాలవరం, పీసీ మండల ప్రాంతాలలో తాను పర్యటించి, బాధితులతో మాట్లాడుతానని జగన్ వారికి హామీ ఇచ్చారు.
ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందనడానికి ఇదొక ఉదాహరణ అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లాలో 424మంది కిడ్నీ బాధితులు చనిపోయారని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.