కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భరోసా | Ensuring to kidney disease victims | Sakshi
Sakshi News home page

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు భరోసా

Published Sun, Mar 4 2018 5:33 PM | Last Updated on Sun, Mar 4 2018 5:33 PM

Ensuring to kidney disease victims - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఎంజీఎం : వరంగల్‌ మహాత్మా గాంధీ మెమోరియల్‌ ఆస్పత్రిలో పేద రోగులను సేవలను మెరుగు పర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సర్జరీ విభాగంలో మరో 30 పడకల సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. అంతేకాకుండా నేషనల్‌ అకిడేషన్‌ బోర్డు ఫర్‌ సర్టిఫికేషన్‌ లక్ష్యంగా ముందుకెళ్తూ.. రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన మెకానైజ్జ్‌ లాండ్రి పరికరాన్ని సైతం అందుబాటులోకి తెస్తున్నారు. ఈ 6న వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్‌ దొడ్డ రమేశ్‌ తెలిపారు.

గతంలో బీబ్రా కంపెనీతో కుదిరిన పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌ పద్ధతిన కొనసాగతున్న 14 డయాలసిస్‌ యూనిట్‌ ఒప్పందన ముగిసినా.. క్రమంలో మరో 14 యూనిట్ల డీ మేడ్‌ కంపెనీ పీపీపీ పద్ధతిన ఒప్పందం నూతన సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో ఎంజీఎం ఆస్పత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు మెరగపడనున్నట్లు ఆయన తెలిపారు.

‘ఆరోగ్యశ్రీ’ లేకున్నా సేవలు..
గతంలో ఎంజీఎంతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే డయాలసిస్‌ సేవలు ఉచితంగా చేసేవారు. 6వ తేదీ నుంచి అందుబాటులోని రానున్న నూతన డయాలసిస్‌ యూనిట్లతో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా.. లేకున్నా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సూపరిండెంట్‌ రమేశ్‌ పేర్కొన్నారు. గతంలో బీ బ్రాన్‌ యూనిట్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రమే డయాలసిస్‌ సేవలు అందేవి, అయితే ఆ కంపెనీతో గత ఏడాదిలోనే ఒప్పందం ముగిసిన నేపథ్యంలో డయాలసిస్‌ను ఎంజీఎం ఆస్పత్రి వైద్యాధికారులే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 14 యూనిట్ల డీ మేడ్‌ కంపెతో ఒప్పందం కుదుర్చుకోగా ఈ యూనిట్లలో ఆరోగ్యశ్రీ సేవలందిస్తూ, ఎంజీఎంలో కొనసాగతున్న డయాలసిస్‌ యూనిట్లతో పేద రోగులకు సేవలందించనున్నట్లు సూపరిండెంట్‌ తెలిపారు. 

ఎన్‌ఏబీహెచ్‌లో మొదటి అడుగు... 
ఎంజీఎం ఆస్పత్రికి నేషనల్‌ అకిడేషన్‌ బోర్డు సర్టిఫికేషన్‌ లక్ష్యంగా వైద్యాధికారులు కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. రూ.15 లక్షలతో కొనుగోలు చేసిన నూతన మెకానైజ్డ్‌ లాండ్రి పరికరాన్ని 6న ప్రారంభించనున్నారు. 60 కేజీల ఈ పరికరం 250 పడకల బెడ్‌ షీట్లను శుభ్రం చేసేందుకు ఉపయోగపడుతుంది. అతి త్వరలోనే మరో 60 కేజీల లాండ్రి పరికరాన్ని సైతం అందుబాటులోకి తేనున్నారు.

సర్జరీలో విభాగంలో...
ఎంజీఎం సర్జరీ విభాగంలో ఏడో యూనిట్‌ నూతన భవనం ద్వారా మరో 30 పడకల నూతన సేవలు అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్‌ రమేశ్‌ తెలిపారు. వైద్య నిబంధనల ప్రకారం ఈ భవనంలో అందుబాటులోకి రావడం పేద ప్రజలకు సేవలు మెరుగపడనున్నట్లు పేర్కొన్నారు. 

6న ప్రారంభోత్సవం
ఎంజీఎం ఆస్పత్రిలో డయాలసిస్‌ యూనిట్‌తో పాటు ఆస్పత్రిలోని నూతన భవనాలను 6న వైదారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించనున్నాం. ఈ వేడుకలకు జిల్లాలోని వివిధ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
– దొడ్డ రమేష్, 
ఎంజీఎం సూపరింటెండెంట్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement