కాలిఫోర్నియా: మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారనే సంగతి మనకు తెలిసిందే. డయాలసిస్‌కి త్వరలోనే గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ కిడ్నీలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరి. సిలికాన్ ఫిల్టర్‌తోపాటు సజీవమైన రీనల్ కణాలతో కూడిన ఈ హైబ్రిడ్ కిడ్నీ నమూనా ఇప్పటికే సిద్ధమైంది. తొలి ప్రయోగాలు విజయవంతమయ్యాయి కూడా. కిడ్నీ వ్యవస్థకు అనుసంధానించి.. శరీరంలోనే ఉంచేయగల తక్కువ సైజులో ఉంటుంది ఈ హైబ్రిడ్ కిడ్నీ. ఒకసారి అమర్చుకుంటే చాలు. బ్యాటరీల అవసరమూ లేకుండా మన రక్తం ప్రవహించే ఒత్తిడితోనే దాంట్లోని మలినాలను తొలగిస్తుంది. శరీరం ఈ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉంచేందుకు మందులేవీ వాడాల్సిన అవసరం లేదు.
ద కిడ్నీ ప్రాజెక్ట్ పేరుతో కాలిఫోర్నియా వర్సిటీ వారు చేస్తున్న ఈ ప్రయత్నాల ఫలితంగా అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజు యంత్రం తయారైంది. కంప్యూటర్ చిప్‌ల తయారీలో ఉపయోగించే సిలికాన్ సాయంతో అతిసూక్ష్మమైన రంధ్రాలున్న ఫిల్టర్‌ను తయారు చేశారు. పలుచటి ఈ సిలికాన్ ఫిల్టర్ పొరలు ఒకవైపు.. రక్తంలో ఉండాల్సిన నీరు, ఇతర లవణాలను నియంత్రించే రీనల్ ట్యూబుల్ సెల్స్‌తో కూడిన బయో రియాక్టర్ ఇంకోవైపు ఉంటాయి ఈ హైబ్రిడ్ కిడ్నీలో. రోగి తాలూకూ రోగ నిరోధక వ్యవస్థ ఈ కణాలపై దాడి చేసే అవకాశం లేకుండా తగిన రక్షణ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ రెండు భాగాలను విడివిడిగా పరీక్షించి సత్ఫలితాలు సాధించిన శాస్త్రవేత్తలు తాజాగా రెండింటినీ కలిపి పరిశోధనశాలలో పరీక్షించారు.
శరీరంలోని రెండు ప్రధాన ధమనులకు ఈ హైబ్రిడ్ మూత్రపిండాన్ని అనుసంధానిస్తారు. శుద్ధి చేయాల్సిన రక్తం ఒక గొట్టం గుండా దీంట్లోకి ప్రవేశిస్తుంది. శుద్ధి చేసిన రక్తాన్ని మళ్లీ ఇంకో ధమని ద్వారా శరీరంలోకి చేరుతుంది. వ్యర్థాలన్నింటినీ మూత్రాశయానికి మళ్లిస్తుంది. కాలిఫోరి్నయా వర్సిటీ శాస్త్రవేత్తల ఈ ప్రయత్నాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు, తద్వారా సమర్థమైన కృత్రిమ మూత్రపిండాన్ని తయారు చేసేందుకు ‘కిడ్నీ–ఎక్స్’ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే దాదాపు రూ.5 కోట్ల నిధులు కూడా అందాయి.
Comments
Please login to add a commentAdd a comment