ఆ ఆపరేషన్ తర్వాత అన్నీ సమస్యలే!
నా వయసు 31 ఏళ్లు. కిడ్నీలో రాయి ఉందని చెప్పి మూత్రనాళం ద్వారా దాన్ని తొలగించారు.ఆపరేషన్ చేసినప్పటి నుంచి మూత్రంలో మంట, సెక్స్ చేసేప్పుడు విపరీతమైన నొప్పి, అప్పుడప్పుడు మూత్రంలో కొంచెం రక్తం పడటం జరుగుతోంది. యూరిన్‌లో రక్తం కనపడుతుంటే చాలా ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- సీ.వి.ఆర్.ఆర్., తణుకు
కిడ్నీలో రాళ్లను ఆపరేషన్ లేకుండా మూత్రనాళం ద్వారా తొలగించడం చాలా సాధారణమైన ప్రక్రియ. దీని తర్వాత చాలామందిలో ఎలాంటి సమస్యా ఉండదు. కాకపోతే కొద్దిమందిలో మాత్రం యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి, తగిన యాంటీబయాటిక్స్ వాడకపోవడం వల్లగానీ లేదా కొన్ని రాళ్లు లోపలే మిగిలిపోవడం వల్లగానీ మీరు చెప్పిన లక్షణాలు కనిపించవచ్చు. మీరు యూరిన్ కల్చర్ పరీక్ష చేయించుకుని సరైన యాంటీబయాటిక్స్ వాడితే ఇది పూర్తిగా నయమవుతుంది. ఇక ముఖ్యమైన అంశం ఏమిటంటే... ఈ తరహా సర్జరీ (ఎండోస్కోపీ)లో కిడ్నీలో ఒక స్టెంట్ కూడా ఉంచుతారు. దాన్ని ఒక నెల తర్వాత తీయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మరచిపోయి అలా తీయించుకోకపోతే కూడా ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయి. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను మరోమారు సంప్రదించండి.
నా వయసు 21. స్నానం చేసే సమయంలో పురుషాంగంపై ఉన్న చర్మాన్ని వెనక్కి లాగి ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అరుుతే ఈవుధ్య అంగం మీది చర్మం బాగా పొడిగా అరుుపోరుు వుునుపటిలా వెనక్కురావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం కూడా వస్తోంది. ఈ సవుస్యతో చాలా ఆందోళనగా కూడా ఉంది. నాకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
- జీ.ఆర్., ఖమ్మం
పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే కండిషన్‌ను ఫైమోసిస్ అంటారు. ఒక్కోసారి ఫైమోసిస్ వల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పి రావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి వుళ్లీ వుుందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా వుుందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేరుుంచుకోవడమే వుంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా సులువు. మున్ముందు సెక్స్‌కూ ఆటంకాలు ఉండవు. కాబట్టి మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించి వెంటనే తగిన చికిత్స తీసుకోండి.
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్
యాండ్రాలజీ కౌన్సెలింగ్
Published Thu, Jul 16 2015 11:40 PM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM
Advertisement