అల్లుడికి కిడ్నీ దానం | Woman Given Kidney By Son In Law In Kurnool | Sakshi
Sakshi News home page

అల్లుడికి కిడ్నీ దానం

Published Fri, Jul 6 2018 7:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:40 PM

Woman Given Kidney By Son In Law In Kurnool - Sakshi

కిడ్నీ దానం చేసిన అత్త కౌతాళం  వెంకటలక్ష్మి

కోసిగి:  అల్లుడికి కిడ్నీ దానం చేసి ఓ మహిళ ఆదర్శంగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రం కోసిగికి చెందిన కౌతాళం చౌడయ్య, వెంకటలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె అన్నపూర్ణను పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన గిరీష్‌ కుమార్‌కు ఇచ్చి వివాహం చేశారు.  ఏడాదిన్నర క్రితం గిరీష్‌ కుమార్‌కు రెండు కిడ్నీలూ ఫెయిలయ్యాయి. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు.

షోలాపూర్‌లోనే పలువురు వైద్యులను సంప్రదించడంతో పాటు  కిడ్నీ దాతల కోసం వెతికారు. ఎక్కడా లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో తన కుమార్తె సంసారం బాగుండాలని భావించిన వెంకటలక్ష్మి(60) కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఆమె కిడ్నీ మ్యాచ్‌ కావడంతో ఇటీవల షోలాపూర్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో గిరీష్‌ కుమార్‌కు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేశారు. కిడ్నీ ఆపరేషన్‌ విజయవంతమై ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. కిడ్నీ దానం చేసి ఆదర్శంగా నిలిచిన వెంకటలక్ష్మీని పలువురు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కిడ్నీ పొందిన అల్లుడు గిరీష్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement