
ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్మబోయారు!
స్మార్ట్‌ఫోన్‌పై పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. ఐఫోన్ కోసం ఇద్దరు చైనీయులు ఏకంగా తమ కిడ్నీలను అమ్ముకునేందుకు ప్రయత్నించారు.
బీజింగ్: స్మార్ట్‌ఫోన్‌పై పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే. ఐఫోన్ కోసం ఇద్దరు చైనీయులు ఏకంగా తమ కిడ్నీలను అమ్ముకునేందుకు ప్రయత్నించారు. జి యాంగ్షూ రాష్ట్రానికి చెందిన వూ, హువాంగ్‌లు స్నేహితులు. యాపిల్ కంపెనీ లేటె స్ట్ సిరీస్ ‘ఐఫోన్ 6ఎస్’పై వూ మనసు పారేసుకున్నారు. కానీ దాన్ని కొనే స్తోమత లేకపోవడంతో హువాంగ్ ‘మనం చెరో కిడ్నీ అమ్మేసి ఫోన్ కొనేద్దాం’ అని చెప్పాడు.
ఇంటర్నెట్ ద్వారా ఇద్దరూ ఓ కిడ్నీ అమ్మకాల ఏజెంట్‌ను దొరకబుచ్చుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి రావాలని ఆ ఏజెంట్ చెప్పా డు. ఈ ఐఫోన్ ప్రియులు ఆ ఆస్పత్రికి వెళ్లగా ఏజెంట్ కనిపించలేదు. దీంతో వారు కిడ్నీల అమ్మకంపై మళ్లీ ఆలోచించారు. కిడ్నీ అమ్మొద్దన్న వూ మాటల్ని హువాంగ్ వినలేదు. దీంతో వూ పోలీసులను పిలిపించాడు. హువాంగ్ పరారయ్యాడు.