
వాషింగ్టన్ : తలాతోక లేకుండా మాట్లాడటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా మరోసారి ట్రంప్ అసందర్భ ప్రేలాపన చేసి నెటిజన్ల చేతిలో బుక్కయ్యాడు. ఆ వివరాలు.. కిడ్నీ వ్యాధుల చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన కొత్త ఆదేశాలపై బుధవారం ట్రంప్ సంతకం చేశాడు. ఈ సందర్భంగా ట్రంప్ జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘కొత్త ఆదేశాల వల్ల మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారికి, ముఖ్యంగా కిడ్నీలు ఫెయిలయ్యి ఇబ్బంది పడుతున్న వారికి ఎంతో మేలు జరగనుంది. ఇక మీదట వీరికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, డయాలసిస్ వంటి సేవలు చాలా సులభంగా అందుతాయ’ని తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకుంటుండగా ప్రసంగం చివర్లో ట్రంప్ అసందర్భం ప్రేలాపనకు దిగారు.
‘కిడ్నీలు మానవ శరీరంలో చాలా ప్రత్యేకమైనవి. వీటికి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది నమ్మశక్యం కానీ విషయం’ అంటూ తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ఇంకేముంది ట్రంప్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. ‘చరిత్రలో ఇంతవరకూ ఎవరూ చెప్పని గొప్ప విషయాలను ట్రంప్ చెప్తున్నారు.. ఆయన జ్ఞానాన్ని అభినందించాలని’ ఒకరు.. ‘ట్రంప్‌కు హృదయం స్థానంలో కిడ్నీ ఉంది. అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారంటూ’ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
"The kidney has a very special place in the heart."
— TicToc by Bloomberg (@tictoc) July 11, 2019
Trump just signed an executive order to revamp care for kidney disease pic.twitter.com/H5l4IS8M7o
Comments
Please login to add a commentAdd a comment