పుట్టుకతోనే కిడ్నీ, గర్భాశయం లేదని.. | Born without kidney, uterus, UP teen sets self afire | Sakshi
Sakshi News home page

పుట్టుకతోనే కిడ్నీ, గర్భాశయం లేదని..

Published Mon, Dec 7 2015 11:42 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

పుట్టుకతోనే కిడ్నీ, గర్భాశయం లేదని..

పుట్టుకతోనే కిడ్నీ, గర్భాశయం లేదని..

బరేలి: పుట్టుకతోనే ఓ కిడ్నీ, గర్భాశయం లేదన్న విషయాన్ని 17 ఏళ్ల తర్వాత తెలుసుకున్న ఓ అమ్మాయి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బరేలిలో ఈ దారుణం జరిగింది.

బరేలికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని కొన్ని నెలల క్రితం అనారోగ్యంపాలైంది. ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, డాక్టర్ సలహా మేరకు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించారు. నివేదికలో ఆమెకు ఓ కిడ్నీ, గర్భాశయం లేదని తేలింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి డిప్రెషన్కు లోనయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మరికొందరు డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా ఆ అమ్మాయి డిప్రెషన్ నుంచి కోలుకోలేదు. గత శుక్రవారం తండ్రి ఇంట్లోలేని సమయంలో ఆ అమ్మాయి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె కేకలు వేయడంతో తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో ఆమె మరణించినట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement