uterus
-
కవలలే గానీ... గర్భాశయాలు వేరు
వారు కవలలే. ఒక తల్లి పిల్లలే. కాకపోతే చెరో గర్భాశయం నుంచి పుట్టుకొచ్చారు. అదెలా సాధ్యమంటారా? వాళ్లమ్మకు రెండు గర్భాశయాలున్నాయి! ఎంచక్కా ఒక్కోదాంట్లో ఒక్కొక్కరు పురుడు పోసుకున్నారన్నమాట. వైద్యపరంగా అత్యంత ఈ అరుదైన ఘటన చైనాలో జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. పది లక్షల జననాల్లో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందట. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో లీ అనే మహిళ సెపె్టంబర్ తొలి వారంలో పండంటి కవలలకు జన్మనిచి్చంది. పిల్లాడు 3.3 కిలోలు, పాప 2.4 కిలోల బరువుతో పుట్టారు. అయితే వారిద్దరూ చెరో గర్భాశయంలో పెరిగారు! లీకి రెండు గర్భాశయాలుండటమే ఇందుకు కారణం. లీకి గర్భాశయాలు రెండూ సంపూర్ణంగా ఎదగడమే గాక పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ఆమెకు పురుడు పోసిన సీనియర్ డాక్టర్ కై యింగ్ చెప్పుకొచ్చారు. పైగా ఆ రెండింట్లోనూ సహజ పద్ధతిలో గర్భధారణ జరగడం మరీ అరుదని వివరించారు. తమకు తెలిసి గతంలో కేవలం రెండు కేసుల్లో మాత్రమే ఇలా జరిగిందని చెప్పారు. ఇలా జంట గర్భాశయాలుండటాన్ని వైద్య పరిభాషలో యుటెరస్ డైడెలి్ఫస్‌గా పిలుస్తారు. కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇందుకు అవకాశముంటుంది. కారణమేమిటో తెలియకపోయినా, లీకి ఇంతకు ముందు వచి్చన గర్భం నిలవలేదు. 27 వారాల తర్వాత అబార్షన్ అయింది. దాంతో గత జనవరిలో మళ్లీ గర్భం దాల్చాక వైద్యులు పక్కాగా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. అన్నీ సజావుగా జరిగి కాన్పు తేదీ సమీపించాక రిస్కు తీసుకోకుండా సిజేరియన్ చేశారు. గతేడాది అమెరికాలోని అలబామాలో కూడా ఇలాంటి ఉదంతం జరిగినట్టు తెలుస్తోంది. రెండు గర్భాశయాలున్న మహిళ డిసెంబర్లో ఇలాగే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచి్చంది. గత కాన్పులో ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ వారంతా ఒకే గర్భాశయంలో పురుడు పోసుకోవడం విశేషం! ఎందుకిలా...? → గర్భావస్థలో పిండం ఎదిగే క్రమంలో గర్భాశయానికి సంబంధించిన రెండు కీలకమైన ట్యూబులు సకాలంలో కలిసిపోని పక్షంలో అవి రెండు గర్భాశయాలుగా ఏర్పడతాయి. → కొన్ని కేసుల్లో ఒక్కో గర్భాశయానికి విడిగా ఒక్కో ముఖద్వారం ఉంటుంది. యోని గుండా ఏర్పడే సన్నని కణజాల ద్వారం వాటిని విడదీస్తుంది. → ముందస్తు పరీక్షలు చేయించుకుంటే తప్ప గర్భధారణ జరిగేదాకా జంట గర్భాశయాలు ఉనికి ఇతరత్రా బయటపడే అవకాశం చాలా తక్కువ. → ఇలాంటి మహిళలకు గర్భస్రావం జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంతేగాక పిండం సరిగా ఎదగకపోవడం, ముందస్తు కాన్పు, కాన్పు సందర్భంగా విపరీతమైన రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. – బీజింగ్ -
అత్యంత అరుదైన ఘటన!ఒకేసారి రెండు గర్భాలా..!:
ఒక మహిళలకు రెండు గర్భాశయాలు ఉండటం అనేది అత్యంత అరుదు. ఇలా ఉంటే డెలివరీ టైంలో చాలా రిస్క్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఉన్నా రెండింటిలోనూ శిశువులు పెరగడం అనేది కూడా అరుదే. అలాంటి విచిత్ర ఘటనే అలబామాకు చెందిన మహిళ విషయంలో జరిగింది. అసలేం జరిగిందంటే..దక్షిణ అమెరికాలోని అలాబామాకు చెందిన కెల్సీ హాట్చర్, కాలేబ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐతే ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఇందులో వింత ఏంటి? అని అనుకోకండి..ఎందుకంటే? ఈసారి ఒకేటైంలో రెండుసార్లు గర్భం దాల్చింది. ఇదేలా సాధ్యం అని వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఇక్కడ కెల్సీకి తన ఆరోగ్య గురించి ముందు తెలుసు. దీంతో ఆమె ఈసారి తన కడుపులో ఇద్దరు ఉన్నారని తన భర్తకు చెబుతుంది. ఆటపట్టిస్తున్నావు ఇద్దరెలా ఉంటారని ఆమె భర్త కూడా కొట్టిపడేశాడు కూడా. నిజమే!ఇద్దరు శిశువులు పెరుగుతున్నారని నమ్మకంగా చెప్పింది తన భర్తకి. ఆ మహిళకు రెండు గర్భాశయాలున్నట్లు డాక్టర్లు ఇదివరకే ఆమెకు చెప్పారు. అయితే ఈసారి రెండు గర్భాశయాల్లోనూ శిశువులు పెరుగుతున్నాయి. ఇలా జరగదు. ఏదో ఒక దానిలో గర్భం పెరగడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ రెండు గర్భాశయాలు దేనికది వేరుగా పిండాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఒక గర్భాశయంలో ఇద్దరు ఉంటే కవలలు అని పిలుస్తాం. ఇప్పుడు వేర్వేరు గర్భాశయాల్లో పిండాలు పెరుగుతున్నప్పుడూ కూడా కవలలనే పిలవాలా? అనేది సందేహస్పదమైన ప్రశ్న. ఈ మేరకు ఆమెకు వైద్యం అందిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా పటేల్ మాట్లాడుతూ.. ఇలాంటివి అత్యంత అరుదని అన్నారు. కొంతమందది స్త్రీల్లో పుట్టుకతో ఇలా రెండు గర్భాశయాలు ఉంటాయి. ఈ గర్భాశయాలు రెండు చిన్న గొట్టాలతో ప్రారంభమవుతుంది. ఐతే పిండం పెరుగుతున్నప్పుడూ గొట్టాలు సాధారణంగా పెద్ద బోలు అవయవాన్ని సృష్టించేలా కలుస్తాయి. దీన్నే గర్భాశయం అంటారు. కొన్నిసార్లు ఈ ట్యూబ్‌లు పూర్తిగా చేరవు. బదులుగా దేనికది ప్రత్యేకంగా లేదా వేర్వేరు అవయవంగా అభివృద్ధి చెందుతాయి. డబుల్ గర్భాశయం ఒక యోని ప్రారంభాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓపెనింగ్‌ను సర్విక్స్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా ప్రతి గర్భాశయం సెపరేట్ గర్భాశయాన్ని కలిగి ఉంటాయన్నారు. నిజానికి రెండు గర్భాశయాలు ఉన్న చాలా వరకు ఒక గర్భాశయంలోనే పిండం పెరుగుతుంది. రెండు గర్భాల్లోనూ పిండం అనేది పెరగదు. సరిగ్గా పిండం ఎదిగే క్రమంలో ఆ రెండు గొట్టాల్లా ఉన్న ట్యూబ్‌లు ఒక్కటిగా అయ్యి పిండం పెరిగేలా ఒకే గర్భాశయంగా మారతాయి. అరుదైన సందర్భాల్లోనే ఇలా వేర్వేరుగానే రెండు గర్భాశయాల్లో పిండాలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందన్నారు శ్వేతా పటేల్. ఇలా డబుల్ గర్భాశయం ఉన్న స్త్రీలు విజయవంతంగా ప్రెగ్నెంట్ అయినప్పటికీ తరుచుగా గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం జరుగుతుంటుందని క్లిష్టతర కాన్పుల నిపుణడైన డాక్టర్ రిచర్డ్ డేవిస్ చెబుతున్నారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ముగ్గురికి ఇలా డబుల్ గర్భాశయం లేదా డబుల్ గర్భాశయాలు ఉండొచ్చు అని వివరించారు. ప్రస్తుతం తాము సదరు మహిళ కెల్సీని ప్రసవం అయ్యేంత వరకు చాల జాగ్రత్త పర్యవేక్షిస్తూ.. ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తాము ఇద్దరు శిశువులు బాగున్నారని భరోశ ఇవ్వలేమని పటేల్ చెబుతున్నారు. వైద్య పరంగా ఇది అరుదైన విషయమే అయినా ఆ శిశువులని కవలలని కాకుండా ప్రత్యామ్నాయంగా ఏమని పిలవాలో తెలియాల్సి ఉందన్నారు. (చదవండి: ఆహారం అనేది రుచి కోసం అనుకుంటే అంతే సంగతులు! వైద్యులు స్ట్రాంగ్ వార్నింగ్) -
Health Tips: గర్భవతులకు నోటి పరిశుభ్రత అత్యవసరం... ఎందుకంటే...
Importance Of Oral Health During Pregnancy: గర్భవతి తన నోటి ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవడం ఎంతో అవసరం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గర్భవతుల్లో సాధారణంగా ‘ప్రెగ్నెన్సీ జింజివైటిస్’ అనే చిగుర్ల వ్యాధి వస్తుంటుంది. ఇది గర్భధారణ జరిగిన రెండో నెలలో కనిపిస్తుంటుంది. ఒకవేళ ఆ మహిళకు ముందే చిగుర్ల సమస్య ఉంటే అది గర్భధారణ తర్వాత మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి సమయాల్లో నోటి శుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే చిగుర్లలో వాపురావడం లేదా నోటిలో కణుతులు, నాన్ ఇన్ఫ్లమేటరీ, నాన్ క్యాన్సరస్ వంటి గడ్డలు పెరగవచ్చు. అంతేకాదు... గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోకపోతే నిర్ణీత వ్యవధి కంటే చాలా ముందుగానే ప్రసవం కావడం (నెల తక్కువ బిడ్డలు పుట్టడం), చాలా తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి సమస్యలు రావచ్చు. నోటిశుభ్రత పరంగా దీనికి కారణాలూ ఉన్నాయి. నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా రక్త ప్రవాహంతో పాటు కలిసిపోయి గర్భసంచి (యుటెరస్)కి చేరి, ప్రోస్టాగ్లాండిన్ వంటి రసాయనాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అదే గర్భధారణ వ్యవధికి ముందే ప్రసవానికి (ప్రీ–మెచ్యుర్ లేబర్‌కు) దారితీసే అవకాశం ఉంది. అందుకే గర్భవతులు నోటి ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను (ఓరల్ హైజీన్‌ను) ఎంత బాగా పాటిస్తే... కాబోయే తల్లికే కాదు... పుట్టబోయే బిడ్డకూ మేలు చేస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవలి కొన్ని పరిశోధన ఫలితాలూ వెల్లడిస్తున్నాయి. చదవండి: Tamarind Leaves: చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. -
పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..
యశవంతపుర: గర్భకోశం తొలగించిన మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం వైద్యుల అలసత్వం వల్ల ఖజానాకు తిరిగి వెళ్లిపోయింది. ఈ మహిళలకు సాయం చేయాలని హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా ఆస్పత్రికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. గర్భకోశం తొలగించుకున్నవారికి ఆస్పత్రిలోనే చెక్కు రూపంలో అందించాలి. కానీ వైద్యులు ఎవరికీ ఆర్థిక సాయాన్ని అందించలేదు. నిధులను వాడుకోకపోవడంతో సర్కారుకి తిరిగివెళ్లాయి. దీంతో బాధిత మహిళలు శిగ్గావిలోని సీఎం బసవరాజ్ బొమ్మై ఇంటికి పాదయాత్రగా బయల్దేరారు. 8 ఏళ్ల నుంచి 1522 మంది మహిళలకు గర్భకోశం తొలగించారు. వారందరికీ మొండిచెయ్యి చూపారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ శాంతపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. (చదవండి: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్) -
అంకుర ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని అంకుర ఆస్పత్రిలో అత్యంత అరుదైన ఆపరేషన్ నిర్వహించి కవలలను బతికించినట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదావాణి వెల్లడించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన మహిళ అత్యంత అరుదైన రకానికి చెందిన గర్భంతో ఉన్నట్లుగా గర్భధారణ జరిగిన తర్వాత 18వ వారంలో తాము గుర్తించామన్నారు. ఆమె మోనో కొరియోనిక్ ట్విన్స్ (గర్భాశయంలో ఇద్దరు పిల్లలు ఒకే ప్లాజంటా అమినిటిక్ సాక్‌ను పంచుకోవడం)గా కలిగి ఉన్నట్లు తేలిందిన్నారు. ఇలా ఉండటం అత్యంత అరుదని 35 వేల నుంచి 60 వేల గర్భాల్లో ఒకటి మాత్రమే ఇలాంటివి చోటు చేసుకుంటాయన్నారు. దీని వల్ల పిండాలకు తీవ్ర మైన సమస్యలు తలెత్తుతాయని అలాంటి స్థితిలో పిండాలు బతికేందుకు 50 శాతం వరకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసు విషయంలో కవలలకు ఒకరికి కపాలం, మెదడు అసంపూర్ణంగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో గర్భంలో ఉన్న శిశువును సెలక్టివ్ రిడెక్షన్ ప్రత్యేక టెక్నిక్స్‌ను ఉపయోగించి తొలగించడం జరిగిందన్నారు. ఇది దేశంలోనే అత్యంత అరుదైంది అన్నారు. ప్రసవం జరిగే వరకు ఎంతో జాగ్రత్తగా పరిశీలించాల్సి వచ్చిందన్నారు. వీరిని బతికించడం, డెలివరీ చేయడం సవాళ్లతో కూడుకున్నదని చక్కని వైద్య నిపుణులతో మంచి ఉపకరణాలున్న ఎన్ఐసీయూలతో ఇలాంటి కేసులో ఫలితాలు సాధించామని వారు వెల్లడించారు. -
లంగర్‌హౌస్: మహిళ కడుపులో 3 కిలోల కణితి..
సాక్షి, లంగర్‌హౌస్: ఓ మహిళ గర్భాశయం నుంచి 3 కిలోల కణితిని లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆస్పత్రి వైద్యులు విజయంవంతంగా తొలగించారు. ఏపీలోని గుంటూరుకు చెందిన మహిళ 15 సంవత్సరాల క్రితం గర్భాశయ ముఖం ద్వారా క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు. అయితే కొంత కాలంగా ఆమెకు కడుపులో తీవ్రమైన నొప్పి, కడుపు ఉబ్బడం, వెన్నెముక నొప్పి తదితర కారణాలతో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భాశయంలో పెద్ద కణితి ఉందని చెప్పారు. అనంతరం వైద్యులు డాక్టర్ రాజాశ్రీ, ఆంకో సర్జన్ డాక్టర్ సంజయ్‌ల ఆమెకు విజయవంతంగా సర్జరీ చేసి మూడు కిలోల బరువున్న కణితిని తొలగించారు. కాగా గర్భాశయంతో పాటు కణజాలంలో వ్యాపించిన ట్యూమర్ అవశేషాలను కూడా తొలగించామని వైద్యులు తెలిపారు. ఎటువంటి పోస్టు ఆపరేటివ్ ఇబ్బందులు లేకుండా పేషెంట్ పూర్తిగా కోలుకున్నారని, ఆమెను డిశ్చార్చి చేశామని వైద్యులు తెలిపారు. -
ఆడా-మగా జననాంగాలు.. 25 ఏళ్ల తర్వాత వివాదాస్పదం
వైద్య శాస్త్రంలో ఓ అరుదైన కేసు.. సుమారు పాతికేళ్ల తర్వాత వివాదాస్పదంగా మారింది. ఆడ-మగ జననాంగాలతో(ఇంటర్‌సెక్స్ జెండర్) కలగలిసి పుట్టిన ఓ బిడ్డను.. సర్జరీలతో పూర్తి మగాడిలా మార్చేశారు వైద్యులు. అయితే ఆ నిర్ణయంపై అతడుగా ఉన్న ఆమె ఇన్నేళ్ల తర్వాత పోరాటానికి దిగింది. తన అనుమతి లేకుండా క్రూరంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తనును మళ్లీ యథాస్థితికి మార్చేయాలని కోరుతోంది. హవాయి స్టేట్ పూనాకి చెందిన 24 ఏళ్ల యోగా ఎక్స్పర్ట్ లూనా అనిమిషా.. తనను మహిళగా మార్చేయాలని పోరాడుతోంది. పుట్టినప్పుడు డాక్టర్లు ఆమె జననాంగాన్ని కుట్టేయడంతో పాటు, సర్జరీ ద్వారా గర్భసంచిని తొలగించారు. దీంతో లూనా.. ఇన్నేళ్లూ మగవాడిలానే పెరుగుతూ వస్తోంది. అయితే తనలో ‘ఆమె’ను ఎంతో కాలం అణుచుకోలేకపోయింది లూనా. అయితే తనని ఓ జంతువులా భావించి కర్కశంగా వ్యవహరించిన డాక్టర్ల తీరును తప్పుబడుతూ.. తిరిగి సర్జరీలకు ఆమె సిద్ధమైంది. ‘‘తప్పు నా తల్లిదండ్రులదా? ఆ డాక్టర్లదా? అనే ప్రసక్తి కాదు. అంతిమంగా ఇబ్బంది పడుతోంది నేను. నాకు మగాడిగా కంటే ఆడదానిగా బతకడమే ఇష్టంగా అనిపిస్తోంది. 14 ఏళ్ల వయసులో తొలిసారి నా శరీరానికి కలిగిన గాయమేంటో నేను అర్థం చేసుకోగలిగాను. ఇన్నేళ్లలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. అవమానాల్ని భరించాను. అసలు నా గుర్తింపు కోసం మానసిక క్షోభను అనుభవించాను. ఎవరితోనూ కలవలేకపోయాను. బొమ్మలతో ఆడుకోవాలని, గౌన్లు వేసుకోవాలనే కోరికల్ని అణచివేసుకున్నా. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, ఇప్పుడు పోరాడే వయసు, శక్తి రెండూ నాకు వచ్చాయి’’ అని నవ్వుతూ చెప్తోందామె. మగాడి గుర్తింపును వద్దనుకుంటున్న లూనా.. సర్జరీలకు అవసరమయ్యే డబ్బు కోసం ‘గో ఫండ్ మీ’ వెళ్లింది. లక్షా యాభై వేల డాలర్లు సేకరించి.. తన కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటోంది. 2019లో క్లీవ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళకు చనిపోయిన మహిళ గర్భసంచిని మార్పిడి ద్వారా ఎక్కించారు. అలా ఆ మహిళ తల్లి కాగలిగింది కూడా. ఆ కేసును రిఫరెన్స్‌గా తీసుకుని లూనా.. తనకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తోంది. అంతేకాదు సొసైటీలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఇంటర్‌సెక్స్, ట్రాన్స్‌జెండర్ బాధితుల కోసం లూనా పోరాడుతోంది కూడా. చదవండి: ‘అవును.. నేరాలు చేశా, ఘోరాలకు పాల్పడ్డా’ -
చెరకు గడ చీలుస్తున్న గర్భసంచి
‘నీ గర్భసంచి ఇవ్వు... నీకు కూలిడబ్బులు ఇస్తా’ అని ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అనగలుగుతారేమో. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీలు పడే బాధలు ఎన్నో ఎందరికి తెలుసు? మహారాష్ట్రలోని బీడ్ చెరకు ఉత్పత్తిలో మేటి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అక్కడ కోతకాలం. కోతకు వచ్చిన కూలీలు నెలసరికి మూడురోజుల విశ్రాంతి తీసుకుంటే కూలి డబ్బులు పోతాయి. జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే అక్కడ కూలి చేయడానికి ముందే గర్భసంచి తొలగించుకుంటారు. ఈ కడుపుకోతపై దర్శకుడు అనంత్ మహదేవన్ ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం– బిట్టర్‌స్వీట్) అనే మరాఠి సినిమా గత సంవత్సరం తీశాడు. వివిధ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతున్న ఈ సినిమా ఇటీవల జనవరి 8–15 తేదీల మధ్య జరిగిన కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ ఇది. ‘చెరకు కట్ చేసే మిషను రెండున్నర కోట్లు ఉంటుంది. చక్కెర ఉత్పత్తిదారులు అంత పెట్టి మిషన్ ఎందుకు కొంటారు... అతి సలీసుగా కూలీలు దొరుకుతుంటే’ అంటారు దర్శకుడు అనంత్ మహదేవన్. ఆయన మరాఠిలో తీసిన ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం) సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ప్రశంస సినిమా గొప్పదనం గురించి కాదు. ఒక చేదు వాస్తవాన్ని కథగా ఎంపిక చేసుకోవడం గురించి. ఎందుకంటే ఈ సినిమా చెరకు కోత కోసం పని చేసే లక్షలాది మంది మహిళా కూలీల వెతను చూపింది కాబట్టి. బీడ్‌లో బతుకుపోరు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో షుగర్ ఫ్యాక్టరీలకు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం చాలా కీలకం. చెరకుపంట కోత కాలం అది. లక్షల ఎకరాల్లో పంటను కోయడానికి కూలీలు కావాలి. మహారాష్ట్రలోని ఒక్క బీడ్ జిల్లాలో 5 లక్షల మంది చెరకు కోత కూలీలు ఉన్నారు. బీడ్ అంతగా పంటలు పండని ప్రాంతం కనుక ఇక్కడి నుంచి వలస ఎక్కువ. వీరు చెరకు కోత వచ్చే ఆరు నెలల కాలం కోసం కాచుకుని ఉంటారు. చెరకు కోతకు వెళ్లి్ల ఏం కోల్పోతున్నారనేది ‘బిట్టర్‌స్వీట్’ సినిమాలో చూపించాడు దర్శకుడు. వీరి కన్నీరు రక్తం కలగలవడం వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే రెండవ పెద్ద చక్కెర ఎగుమతిదారు అయ్యిందని అంటాడతను. దారుణమైన దోపిడి చెరకు పంట కోయించి ఫ్యాక్టరీలకు చేరవేసేందుకు చక్కెర ఫ్యాక్టరీలు ‘ముకదమ్’లను ఏర్పాటు చేసుకుంటారు. ముకదమ్‌లంటే దళారీలు. వీరు కూలీలను పట్టుకొని వచ్చి కోత కోయించాలి. అంతేకాదు ఇచ్చిన సమయంలో ఇచ్చినంత మేరా కోత జరిగిపోవాలి. ఇందుకోసం దళారీలు బీడ్ ప్రాంతం నుంచి వయసులో ఉన్న భార్యాభర్తలను కూలికి పిలుస్తారు. వీరిని ‘జోడీ’లంటారు. ఈ జోడీలకు ముందే 80 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఇచ్చేస్తారు. ఆ మేరకు వీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. రోజుకు పది నుంచి 12 గంటలు పని చేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక జోడి రోజులో రెండు మూడు టన్నుల చెరకు పంటను కోస్తారు. నెలసరి తప్పించుకోవడానికి జోడీలు ప్రతిరోజూ పని చేయాలి. చేయకపోతే కూలి దక్కదు. పైగా జరిగిన నష్టానికి జుర్మానా కట్టాలి. ఈ ఆరునెలల కాలంలో జోడీలోని భార్య నెలసరి సమయంలో మూడు రోజుల విశ్రాంతి తీసుకునే అవసరం పడొచ్చు. మూడురోజుల కూలీ పోవడం ఎదురు జుర్మానా కట్టాల్సి రావడం జోడీకి చాలా కష్టం అవుతుంది. అందుకని నెలసరి రాకుండా గర్భసంచిని తీసేయించడం బీడ్‌లో ఒక దయనీయమైన ఆనవాయితీ అయ్యింది. బీడ్ జిల్లాలో దాదాపు 100 ఆస్పత్రులు ఉంటే వాటిలో పది ఆస్పత్రులు ఇవే పని మీద ఉంటాయి. దళారీలకు ఈ ఆస్పత్రులతో అండర్స్టాండింగ్ ఉంటుంది. దళారీ గర్భసంచి తీసే ఆపరేషన్ కోసం విడిగా అప్పు ఇస్తాడు. అది ప్రతి సంవత్సరం కూలీలో కొంత కొంత కోత వేసుకుంటాడు. పైగా గర్భసంచి ఆపరేషన్‌కు మనిషిని పంపినందుకు కమిషన్ కూడా దొరుకుతుంది. ‘గర్భసంచులు లేని స్త్రీల ఊరు అని బీడ్ గురించి వార్త చదివాకే నాకు ఈ సినిమా తీయాలనిపించింది’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమా కథలో... ఈ సినిమా కథలో దర్శకుడు సత్యభామ అనే కోత కూలీ పాత్ర ద్వారా మనకు కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కోత పని సజావుగా సాగడానికి సత్యభామ గర్భసంచిని తీయించుకోవాలని ఆమెపై వొత్తిడి వస్తుంది. తీయించుకోవాలా వద్దా అనే సంఘర్షణలో మనకు సమస్య నేపథ్యం తెలుస్తుంది. చివరకు సత్యభామ గర్భసంచి తీయించుకోవడానికే అంగీకరిస్తుంది. ‘ఇది ఆమె శారీరక హక్కును బలవంతంగా తిరస్కరింప చేయడమే. పిల్లలు కనే హక్కును నివారించడమే. తన దేహం మీద తన హక్కును మహిళా కూలీలు కోల్పోవడమే కాదు భావితరాల పుట్టుకను కూడా నిరాకరిస్తున్నారు’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే నటించారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా మంచి స్పందనను పొందుతోంది. – సాక్షి ఫ్యామిలీ -
వరుసగా అబార్షన్స్ అవుతున్నాయి... సంతానం కలుగుతుందా?
నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ►ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ►గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ►గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ►గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ►కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ►వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ►రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మైగ్రేన్ తలనొప్పి... చికిత్స ఉందా? నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. వారంలో ఒకటి, రెండు సార్లు తీవ్రంగా వస్తోంది. ఎన్నో రక్తపరీక్షలు, ఎక్స్–రే, స్కానింగ్ పరీక్షలు చేయించాను. డాక్టర్లు దీన్ని మైగ్రేన్‌గా నిర్ధారణ చేశారు. జీవితాంతం వస్తుంటుందని చెప్పారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? తరచూ తలనొప్పి వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. నేటి ఆధునికయుగంలో శారీరక, మానసిక ఒత్తిడి, అనిశ్చితి, ఆందోళనలు తలనొప్పికి ముఖ్యమైన కారణాలు. ఇంకా రక్తపోటు, మెదడు కణుతులు, మెదడు రక్తనాళాల్లో రక్తప్రసరణల్లో మార్పులు, సైనసైటిస్ మొదలైన వాటివల్ల తలనొప్పి వచ్చేందుకు ఆస్కారం ఉంది. తలనొప్పి ఏ రకానికి చెందినదో నిర్ధారణ తర్వాత కచ్చితమైన చికిత్స చేయడం సులువవుతుంది. మైగ్రేన్ తలనొప్పిని పార్శ్వపు తలనొప్పి అంటారు. మానసిక ఆందోళన, ఒత్తిడి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్, నిద్రలేమి, అధికప్రయాణాలు, సూర్యరశ్మి, స్త్రీలలో హార్మోన్ సమస్యల వల్ల ఈ పార్శ్వపు తలనొప్పి వస్తుంటుంది. ఇది స్త్రీలలోనే ఎక్కువ. మైగ్రేన్‌లో దశలూ, లక్షణాలు: సాధారణంగా మైగ్రేన్ వచ్చినప్పుడు 24 గంటల నుంచి 72 గంటలలోపు అదే తగ్గిపోతుంది. ఒకవేళ 72 గంటలకు పైనే ఉంటే దాన్ని స్టేటస్ మైగ్రేన్ అంటారు. దీంతోపాటు వాంతులు కావడం, వెలుతురునూ, శబ్దాలను అస్సలు భరించలేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వ్యాధి నిర్ధారణ: రక్తపరీక్షలు, రక్తపోటును పరీక్షించడం, సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా మైగ్రేన్‌ను నిర్ధారణ చేయవచ్చు. నివారణ: మైగ్రేన్ రావడానికి చాలా అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు మనం తినే ఆహారంలో మార్పులు, మనం ఆలోచించే విధానం, మానసిక ఒత్తిడి, వాతావారణ మార్పులు, నిద్రలేమి, మహిళల్లో రుతుసమస్యలు వంటి కారణాలతో వచ్చినప్పుడు జీవనశైలిలో మార్పులతో దీన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇక మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు వ్యాయామం, యోగా, ప్రాణాయామం చేయాలి. చికిత్స: మైగ్రేన్‌ను పూర్తిగా తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. శారీరక, మానసిక, కుటుంబ, అనువంశీక, వాతావరణ, వృత్తిసంబంధమైన కారణాలను అంచనా వేసి, వాటిని అనుగుణంగా మందును ఎంపిక చేయాల్సి ఉంటుంది. వారి జెనెటిక్ కన్‌స్టిట్యూటషన్ సిమిలియమ్ వంటి అంశాలన పరిగణనలోకి తీసుకొని బెల్లడోనా, ఐరిస్, శ్యాంగ్యునేరియా, ఇగ్నీషియా, సెపియా వంటి కొన్ని మందులు మైగ్రేన్‌కు అద్భుతంగా పనిచేస్తాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ బాబుకు ఆటిజమ్... చికిత్స ఉందా? మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య. యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ►అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ►నలుగురిలో కలవడలేకపోవడం ►ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ►వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ మళ్లీ రాకుండా తగ్గించవచ్చా?
నా వయసు 44 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు మా అమ్మాయి వయసు 23 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పట్నుంచీ జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి చాలా సూక్ష్మ మోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై చాలా ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సాధారణ జీవక్రియలైన జీర్ణక్రియ మొదలుకొని, శరీరక, మానసిక ఎదుగుదల, మానసిక సమతౌల్యత వంటి అంశాలన్నింటికీ ఇవి తోడ్పడతాయి. హైపోథైరాయిడ్, పీసీఓడీ, సంతాన లేమి, డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్ అసమతౌల్యత వల్ల వచ్చేవే. ఈ హార్మోన్ల సమతౌల్యత దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచిమందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ నాకు ఇకనైనా సంతానం కలుగుతుందా? నా వయసు 33 ఏళ్లు. వివాహమై ఎనిమిదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ►జన్యుసంబంధిత లోపాలు ►థైరాయిడ్ సమస్యలు ►అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ►గర్భాశయంలో సమస్యలు ►ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ►డయాబెటిస్ ►గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ►హార్మోన్ సంబంధిత సమస్యలు ►థైరాయిడ్ ►పొగతాగడం ►శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు : ►ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ►సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
వరుసగా అబార్షన్స్...సంతానం కలుగుతుందా?
నా వయసు 33 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడుసార్లు అబార్షన్ అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? మీకు జరిగినట్లు ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ►ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ►గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ►గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ►గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ►కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ►వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ►రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ వేరికోస్వెయిన్స్తగ్గుతాయా? నా వయసు 45 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్య వేరికోస్ వెయిన్స్. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఏర్పడే సమస్యనే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఇందులో శరీరంలోని రక్తనాళాలు రంగు మారతాయి లేదా నలుపు రంగులోకి మారతాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: ►ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ►కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ►ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: ►కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ►కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ►చర్మం దళసరిగా మారడం ►చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం వ్యాధి నిర్ధారణ: అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స: వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ స్పాండిలోసిస్‌కు పరిష్కారం ఉందా? నా వయసు 45 ఏళ్లు. గత కొన్ని నెలల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు: ►కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు ►జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ►స్పైన్ దెబ్బతినడం వల్ల ►వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు: సర్వైకల్ స్పాండిలోసిస్: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. లంబార్ స్పాండిలోసిస్: నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స: రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
పిల్లలు లేని వారికి శుభవార్త!
పారిస్: అమ్మదనానికి నోచుకోలేని స్త్రీలు అనుభవించే బాధ వర్ణనాతీతం. కొందరు స్త్రీలు పుట్టుకతోనే గర్భసంచి లేకుండా పుడితే.. మరికొందరు పెరుగుతున్న క్రమంలో గర్భసంచిని కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి వారికి గర్భసంచి మార్పిడి చేయించుకోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. గర్భసంచి దానం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, ప్రస్తుతం గర్భసంచి దానం చేసేందుకు సంబంధిత మహిళ కుటుంబసభ్యులకే అవకాశం ఉండటం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే బ్రెజిల్‌కు చెందిన వైద్యులు మరణించిన ఓ మహిళ గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. పుట్టుకతోనే గర్భసంచి లేదు.. బ్రెజిల్‌కు చెందిన 32 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. దీంతో ‘మేయర్ రోకీటాన్స్కీ కస్టర్ హైసర్’అనే సిండ్రోమ్‌కు గురైంది. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో 2016 సెప్టెంబర్‌లో గర్భసంచి మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మరణించిన ఓ 45 ఏళ్ల మహిళ గర్భసంచిని ట్రాన్స్‌ప్లాంట్ కోసం సిద్ధం చేశారు. సుమారు 10 గంటలు శ్రమించి ఆమెకు గర్భసంచిని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఐదు నెలల తర్వాత ఆమె గర్భసంచిని పరీక్షించిన వైద్యులకు దుష్ప్రభావాలు కనిపించలేదు. నెలసరి కూడా రెగ్యులర్ అవుతుండటంతో సర్జరీ అయిన 7 నెలలకే ఆమె గర్భసంచిలోకి ఫలదీకరణం చెందిన అండాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం 10 రోజులకు ఆమె గర్భం ధరించినట్లు తెలిపారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా 2017 డిసెంబర్లో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె నుంచి గర్భసంచిని తొలగించారు. -
శోక సంచి
లేబర్ రూమ్ అరుపుల్ని మగవాడు వినాలి. అవి ఇంట్లో గదిలో అర్ధరాత్రి ఏకాంతంలో వినవచ్చే మూల్గులు కావు. అరుపులు. కేకలు. గావుకేకలు. పేగులు తెగిపడే కేకలు. కాదు.. కాదు... గర్భసంచి చిరిగిపోయే కేకలు.... అవి వింటాడా మగవాడు? పడతాడా పోనీ. పడితే తెలుస్తుంది. ‘అల్లా... ముఝే బచాలే అల్లా’... కేకలు పెడుతోంది. ఒకటో కాన్పు కాదు. రెండో కాన్పు కాదు. మూడోది నాల్గోది కాదు. ఐదోది. పెనిమిటికి మగబిడ్డ కావాలట. ఈసారీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తాడో. ఏట్లో తోస్తాడో ఏమో. ‘ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇంకో గర్భసంచి మీద ప్రతాపం చూపుతాడు’ అంటుంది నర్సు పిల్ల. ఆ పిల్లకు ఓర్పు చాలా జాస్తి. ఆ పిల్ల సాయం వల్లే చాలా కాన్పులు ఆ ఆస్పత్రిలో జరుగుతుంటాయి. ఆ పిల్ల లేకపోతే డాక్టరు లేబర్ రూమ్‌లోకి వెళ్లదు. ఇద్దరూ కలిసి చాలా కేసులే చూశారు. ‘ఈ కేసు దుబాయ్‌ది డాక్టర్. తీసుకెళ్లి ఆరునెలలు పెట్టుకున్నాడు. ఇలా చేసి పంపాడు. కాన్పైనాక తిరిగి తీసుకెళ్తాడని ఈ అమాయకురాలి వెర్రి. వాడు ఖాజీకి ఈసరికి ఇంకో పిల్లకు గేలం వేయమని చెప్పేసి ఉంటాడు’ అంటుంది నర్సుపిల్ల. ‘ఈ పిల్లది మరీ అన్యాయం. సొంత బాబాయే’... అని ఇంకో టేబుల్ దగ్గర నిలబెడుతుంది. ‘ఈమెను చూశారా మళ్లీ వచ్చింది. నలభై ఏళ్లు రాబోతున్నా వచ్చిందంటే ఏమనాలి. ఆపరేషన్ అంటే ఆయన వినడు... రాత్రి మీదిమీదికొస్తుంటే ఈమె కాదనలేదు’ అంటుంది మరో టేబుల్ దగ్గర. ‘క్యా ఖాలా... మళ్లీ వచ్చావా?’ ఆమె ఏడుస్తుంది. ‘ఆయన వినడమ్మా... ఆపరేషన్ అంటే వినడు. నా గర్భసంచి చిరిగి నేను పనికి రాకుండా పోతే తప్ప ఇంతే. కంటూ ఉండాల్సిందే’ అంటుంది. పాతబస్తీ చుట్టుపక్కల ప్రసూతి ఆస్పత్రి అంటే కథలు జాస్తి. కన్నీరు జాస్తే. ‘అల్లా... ఈసారైనా రహమ్ చూపు. మగపిల్లాణ్ణి ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టు. ఇంకా నన్ను సాధించకు ఊపర్వాలే’ లేబర్ రూమ్‌లో నుంచి ఆవిడ పెద్ద పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఉంది. చూడాలి అల్లా ఏం చేయబోతున్నాడో. ఈ లోపల నర్సు పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘డాక్టర్... ఎమర్జెన్సీ’...మాసిన బురఖాలేసుకున్న ముగ్గురు నలుగురు ఒకామెను మోసుకుంటూ వచ్చారు. ఆమె కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉంది. వంకరగా తిరిగి పోతూ ఉంది. దవడలు గిట్ట కరుస్తూ ఉంది. పిల్లల్లాగుంది... ఇద్దరు చిన్నపిల్లలు... తల్లిని పట్టుకుని ఏడుస్తున్నారు.‘ఏమైంది?’ డాక్టర్ అడిగింది.‘ఏమో డాక్టర్. అచానక్ ఇలా అయింది’‘ఏమైనా మింగిందా... చెప్పండి’ ‘ఏమో... మాకేం తెలుసు’ వెనుక మొగుడు వచ్చాడు. నలిగిన బట్టలేసుకుని... జుట్టు పెరిగిపోయి... వెర్రి ముఖంతో.‘కొట్టినావా?’‘నై నై... అల్లా కసమ్’నాడీ పట్టుకు చూసింది. బాగానే ఉంది. బీపీ– నార్మల్. గదిలో నుంచి అందర్నీ వెళ్లగొట్టి తలుపులేసి నిలబడింది. అంతవరకూ వంకర్లు పోయిన ఆమె మామూలుగా అయ్యి ముఖం దిగులుగా పెట్టింది.‘ఏంటీ పని?’ ‘ఏం చేయను డాక్టర్.. మీరే కాపాడాలి. బస్తీలో ఉంటాము. మా ఆయన ఆటో వేస్తాడు. ఇప్పటికి నలుగురు పిల్లలు. ఆపరేషన్ వద్దంటాడు. అలాగని దూరం ఉంటాడా. ఉండడు. రాత్రయితే తాగొచ్చి పక్కన చేరుతాడు. ఇప్పటికే తినడానికి తిండి లేదు. నేను కూడా మెహనత్ చేస్తేనే ఒక పూటైనా ముద్ద నోట్లోకి పోతోంది. ఇంక నాకు కనే ఓపిక లేదు. ఇంకొక్క కడుపంటే ఉత్తపుణ్యానికే చచ్చిపోతాను. నా ప్రాణం బాగలేదని గుండె జబ్బు ఉందని ముట్టుకుంటే చచ్చిపోతానని నా మొగునికి చెప్పండి. ఈ పుణ్యం చేశారంటే మీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగుతాను. లేకుంటే మా ఉసురు దేవుడే పోసుకుంటాడు’... వెక్కిళ్లు పెట్టింది. డాక్టర్ తలుపు తెరిచి అని అందరూ చూసేలా రెండు మూడు ఇంజెక్షన్లు పొడిచింది. మొగుణ్ణి పిలిచి ఆమె చెప్పమన్నట్టే చెప్పింది.అతడు ముఖం చిన్నగా పెట్టుకుని జేబులో నుంచి దస్తీ తీసి కళ్లు దాచుకున్నాడు.‘ఎందుకేడుస్తున్నావ్’‘ఇదంతా నా తాగుడు వల్లే డాక్టర్. ఇంతకు ముందు ఇలా లేకుండె. ఈ మధ్య గిరాకీ సరిగా లేదు. ఓలాలు ఊబర్లని సిటీ అంతా క్యాబులు తిరుగుతున్నాయ్. ఆటోలు నడవట్లేదు. నడిచినా నావంటి ఖటరా ఆటోలను ఎవరూ ఎక్కడం లేదు. రాత్రయితే హైబత్తో మందు తాగుతున్నాను. తాగాక దీని పక్కన చేరుతున్నాను. మా బతుకుల్లో సినిమాలు షికార్లు ఉండవుగా డాక్టర్. హోటళ్లు రెస్టారెంట్లు తెలియదు. ఈ ఊరు తప్ప ఏ ఊరు తిరిగేది లేదు. నెక్లెస్ రోడ్డుకు కూడా వెళ్లేది లేదు. కడుపుకు సరిగా తిండే లేదు. మాకున్న ఒకే ఒక దిల్ బెహలాయి మొగుడికి పెళ్లాం... పెళ్లానికి మొగుడు... ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు.. సరే కానివ్వండి... ఇక మీదట ఆమెను తాకనులేండి’.. ఏడుస్తూనే ఉన్నాడు. ఇది అతడి కథ . అది ఆమె కథ. లేబర్ రూములో‘మగబిడ్డ కావాలి పరవర్దిగార్’ అని అరుస్తున్నదే ఆమె కథ అల్లాది.అంతులేని ఈ కథ సాగుతూనే ఉంటుందా?డా.గీతాంజలి రాసిన ‘బచ్చేదాని’ కథ ఇది.అంటే ‘గర్భసంచి’ అని అర్థం. గర్భసంచి మీద హక్కు ఎవరికి? అది కలిగిన స్త్రీకా? అందులో బీజం వేసే పురుషునికా? ఆమె జన్మించిన సమూహానికా? కులానికా? మతానికా? దేశానికా? ఆ హక్కు ఎవరికి? తన గర్భసంచికి తానే తాడు కట్టి మూత బిగించే హక్కు, తన గర్భాన్ని తానే నిరాకరించే హక్కు, ఆ గర్భంలో ఏది ఉద్భవిస్తే దానినే స్వీకరించి కాపాడుకునే హక్కు స్త్రీకి నిజంగా ఉన్నదా? లేనంత వరకూ అది గర్భసంచి కాదు. శోక సంచి. పునః కథనం: ఖదీర్ - ∙డా. గీతాంజలి -
గర్భ సంచి తొలగింపుతో..
మహిళలల్లో గర్భ సంచి తొలగింపు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది. మెనోపాజ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయన వివరాల ప్రకారం... రెండు అండాశయాలను అలాగే ఉంచి... గర్భాశయాన్ని మాత్రమే తొలగించిన సందర్భాల్లోనూ మహిళలకు గుండె జబ్బులు మొదలుకొని జీవక్రియ సంబంధిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తప్పడం లేదు. ఇప్పటివరకూ అండాశయాల తొలగింపుతోనే సమస్యలన్న అంచనా ఉండేదని, తాజా అధ్యయనం అది తప్పని చెబుతోందని షానన్ లాగ్లిన్ టొమ్మాసో అనే శాస్త్రవేత్త తెలిపారు. మహిళల వయసు 35 ఏళ్ల కంటే తక్కువ ఉంటే వారికి ఈ సమస్యలు మరింత ఎక్కువ ఇబ్బందిపెట్టే అవకాశముందని తెలిపారు. 1980 –2002 మధ్యకాలంలో అండాశయాలను ఉంచి, గర్భాశయం మాత్రమే తొలగించిన రెండు వేల మంది మహిళల వివరాలను... రెండింటినీ తొలగించిన వారితో పోల్చి చూడటం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని వివరించారు. గర్భాశయం మాత్రమే తొలగించిన వారిలో 14 శాతం మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురుకాగా, 13 శాతం మంది అధిక రక్తపోటు, 18 శాతం మంది ఊబకాయం, 33 శాతం మంది గుండెజబ్బులకు గురయ్యారని 35 ఏళ్ల లోపు వారిలో ఈ సమస్యలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని విరించారు. గర్భాశయ తొలగింపు విషయంలో మహిళలు మరింత జాగరూకతతో వ్యవహరించేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. -
గర్భాశయంలో సూదిని వదిలేశారు!
► ఢిల్లీలోని శ్రీజీవన్ ఆసుపత్రి వర్గాల నిర్వాకం ► ఆస్పత్రికి రూ.30 లక్షలు జరిమానా విధించిన డీఎస్‌సీఆర్‌సీ న్యూఢిల్లీ: ఓ ఆసుపత్రికి ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదపరిష్కార సంస్థ (డీఎస్‌సీఆర్‌సీ) 30 లక్షలు జరిమానా విధించింది. ఢిల్లీలోని శ్రీజీవన్ ఆసుపత్రిలో 2009లో ఓ మహిళ ప్రసూతి చికిత్స చేయించుకోగా.. ఆమె గర్భాశయంలో ఓ సూదిని సిబ్బంది అలాగే వదిలేశారు. కొన్నినెలల తర్వాత ఈ విషయం బయటపడింది. గర్భాశయం దెబ్బతిని ఆమె మరోసారి గర్భం ధరించలేని స్థితికి చేరుకుంది. దీనిపై బాధితురాలు జిల్లా వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించగా.. ఆమెకు రూ.3 లక్షలు పరిహారంగా అందించాలని ఆసుపత్రిని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని డీఎస్సీఆర్సీలో సవాలు చేసిన ఆసుపత్రికి.. తాజాగా అక్కడా చుక్కెదురైంది. జిల్లా సంఘం నిర్ణయాన్ని సమర్థించిన డీఎస్‌సీఆర్‌సీ.. 30 లక్షలు రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధిలో డిపాజిట్ చేయాలని ఆసుపత్రిని ఆదేశించింది. వైద్యుడికి బదులుగా ఫార్మసిస్టు మహిళకు ప్రసూతి చికిత్సచేశాడని ఈ తరహా ఇబ్బందులు ఎంతమందికో ఎదురై ఉండవచ్చని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఫైబ్రాయిడ్స్ పూర్తిగా తగ్గుతాయా?
నా వయసు 43 ఏళ్లు. కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. దాంతో ఆందోళనగా ఉంది. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎమ్. నళిని, ఏలూరు గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణాన్ని బట్టి ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు: ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు: గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. – డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ,సీఎండ్‌డి ,హోమియోకేర్ ఇంటర్నేషనల్ ,హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్స్ పూర్తిగా నయమవుతాయి!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నేను గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సిందిగా సూచించారు. శస్త్రచికిత్సానంతరం కూడా భవిష్యత్తులో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని వైద్యుడు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందా? - సునీత, విజయవాడ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. దాదాపు 20 - 50 శాతం వరకు ఇవి పిల్లలను కనే వయసులో వస్తుంటాయి. అంటే ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులో ఏర్పడుతుంటాయి. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చాలావరకు ఇవి గర్భాశయాన్ని తొలగించాక వస్తుంటాయి. సాధారణంగా ఈ కణుతులు గర్భాశయపు కండర కణజాలంతో ఏర్పడతాయి. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్ధకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ అదేపనిగా పెయిన్కిలర్స్ వాడవద్దు... ఆర్థో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. రోజూ స్కూటర్ మీద ఆఫీసుకు వెళ్తాను. గత కొంతకాలంగా నేను కీళ్ల సమస్యతో బాధపడుతున్నాను. పెయిన్‌కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతున్నంతసేపు పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే ఇలాంటి మందులు ఎక్కువ రోజులు వాడితే కిడ్నీ, లివర్‌కు మంచిది కాదని స్నేహితులు, కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. స్కూటర్ స్టార్ట్ చేసేప్పుడు, స్టాండ్ వేసే సమయంలో నాకు నొప్పులు విపరీతంగా వస్తున్నాయి. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తోంది. దయచేసి నా బాధలకు శాశ్వత ఉపశమనం కలిగించే మార్గాన్ని సూచించండి. - నాగరాజు, హైదరాబాద్ మీరు ఎదుర్కొంటున్న సమస్యను వైద్యపరిభాషలో ‘ఆర్థరైటిస్’ అంటారు. గతంలో పెరిగే వయసు రీత్యా ఈ సమస్యలు వచ్చేవి. కానీ ఇటీవల 20 - 50 ఏళ్ల వయసు వారిలో సగానికిపైగా ఆర్థరైటిస్‌కు లోనవుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. ఇక మీ విషయానికి వస్తే... మీరు కూడా ఆర్థరైటిస్ సమస్యతోనే బాధపడుతున్నారని చెప్పాలి. ఎముకల మధ్య కుషన్‌లా కార్టిలేజ్ అనే పొర ఉంటుంది. ఇది అరిగిపోయినా, పూర్తిగా దెబ్బతిన్నా ఎముకలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నా, వాపు వచ్చినా ఈ కీళ్లనొప్పులు ఏర్పడతాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న వివరాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారికి మోకాళ్లు, మోచేతులు, కాలి వేళ్లు, మణికట్టు. భుజాలు, నడుము, వెన్నెముక భాగాల వాపుతో నొప్పి వస్తుంటుంది. కొన్నిసార్లు ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి జ్వరం రావడం, కదల్లేకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి ముఖ్య లక్షణాలు ఆధారంగా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించవచ్చు. ముందుగా మీరు పెయిన్‌కిల్లర్స్ వాడటం మానేయండి. అవి కిడ్నీ లాంటి అవయవాలకు చేటు చేస్తాయి. మీరు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. ఆయన మీ వ్యాధికి సంబంధించి ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్, సీరమ్ యూరిక్ యాసిడ్, వీడీఆర్ఎల్, సీబీసీ, ఎక్స్‌రే (ఆయా కీళ్లకు సంబంధించినవి)లాంటి కొన్ని నిర్ధారణ పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇస్తారు. పరీక్ష ఫలితాలను బట్టి మీకు చికిత్సా విధానాన్ని అవలంబిస్తారు. కొన్ని సమస్యలు మందులతో పాటు ఫిజియోథెరపీ లాంటి వాటితో తగ్గిపోతాయి. కానీ కొన్నింటికి మాత్రం సర్జరీ తప్పనిసరి అవుతుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, శస్త్రచికిత్స విధానాల ద్వారా మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలకూ గురికానవసరం లేదు. ఈలోగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించండి. అవి... వంటలలో ఉప్పు, నూనె బాగా తగ్గించాలి అధిక బరువు లేకుండా చూసుకోండి. వ్యాయామం, యోగా లాంటివి చేయాలి క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు, తాజా కూరగాయలను తీసుకోండి పాలు, గుడ్లు, పెరుగు వంటివి అధికంగా తినాలి పాదరక్షలు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి మంచినీరు బాగా తాగాలి డయాబెటిస్ ఉంటే అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ బాధ మరీ ఎక్కువగా అనిపిస్తే ఫిజియోథెరపీతో కూడా ఉపశమనం పొందవచ్చు. అంతేగాని డాక్టర్ సలహా లేకుండా మాత్రం విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వాడటం చాలా ప్రమాదం. డాక్టర్ కీర్తి తలారీ బొమ్మకంటి సీనియర్ రుమటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నాకిప్పుడు 28 ఏళ్లు.. పెళ్లంటే భయం!
సందేహం నాకిప్పుడు 28 ఏళ్లు. మా ఇంట్లో నాకు మూడు నాలుగేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు పెళ్లంటే ఆసక్తి లేదు. ఎన్ని సంబంధాలు వచ్చినా... ఏదో ఒక వంక పెట్టి చెడగొడుతున్నాను. అసలు కారణం ఏమిటంటే.. నాకు సెక్స్ అంటే చాలా భయం. స్కూల్ ఏజ్ నుంచే నాకు పెళ్లి అన్నా, సెక్స్ అన్నా భయం ఏర్పడింది. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను. నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది లేరు. మా అమ్మానాన్నలు మొదట ఊరుకున్నా.. ఈ మధ్య బాగా తిడుతున్నారు. ఎలాగైనా పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. నా బాధ అర్థం చేసుకొని, పరిష్కారం చెప్పండి ప్లీజ్. - ఓ సోదరి కొందరు ఆడవారిలో వారి చిన్నతనంలో ఇంట్లో లేదా బయట పెళ్లి, సెక్స్ గురించి కొన్ని సంఘటనలు చూడడం వల్ల, లేకపోతే స్నేహితులు మాట్లాడుకోవడం విని భయపడటం వల్ల, ఇంకా కొన్ని కారణాల వల్ల.. పెళ్లి, సెక్స్ మీద చెడు అభిప్రాయం పెంచుకొని భయపడుతుంటారు. దానివల్ల వయసు పెరిగినా భయం పోకుండా పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. మీ విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది. మీరు లోపల భయపడుతూ నాలుగేళ్ల నుంచి పెళ్లి సంబంధాలను నిరాకరిస్తూ ఉంటే.. మీ పెద్దవాళ్లు మాత్రం ఎంత కాలం అని ఓపిక పడతారు. ఒకపక్క మీ వయసు పెరుగుతుంటే వాళ్లు మరింత కంగారు పడుతుంటారు. అందరూ మీలాగే పెళ్లికి భయపడి వాయిదా వేస్తూ ఉంటే.. లోకంలో ఎంతమందికి పెళ్లిళ్లు అవుతాయి? మీరు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్లే ఇలా జరుగుతోంది. కాబట్టి మీరు ఆ భయం నుంచి బయటపడి, పెళ్లి గురించి, దాని తర్వాత జీవితం గురించి ఆలోచించండి. మీ పెద్దల మాట విని సంతోషంగా పెళ్లి చేసుకోండి. ఒకవేళ ఇంకా అలాగే ఉంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోండి. నా వయసు 27. నాకు పెళ్లై రెండేళ్లయింది. నాకిప్పుడు నాలుగు నెలల బాబు ఉన్నాడు. వేసవిలో విరివిరిగా దొరికే మల్లెపూలంటే నాకు చచ్చేంత ఇష్టం. కానీ ఇప్పుడు బాలింతనని, బాబుకు పాలు పడుతున్నానని మల్లెపూలు పెట్టుకోనివ్వడం లేదు మా ఇంట్లో వాళ్లు. పాలు ఇవ్వడానికి, మల్లెపూలకు సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చండి. - రాజేశ్వరి, మీర్పేట్ మల్లెపూల వాసనతో లేదా మల్లెపూలు రొమ్ము మీద ఎక్కువసేపు ఉండడం వల్ల మెదడు నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ తరచూ మల్లెపూలు పెట్టుకోవడం, వాటి వాసనను ఎక్కువగా పీల్చడం వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ (ఇది పాల ఉత్పత్తిని పెంచే హార్మోన్) తగ్గి, దానివల్ల పాలు రావడం కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ తెలియక పోయినా... పాలు తగ్గుతాయనే విషయం తెలిసే మీ పెద్దవాళ్లు మిమ్మల్ని మల్లెపూలు పెట్టుకోవద్దని చెప్పి ఉండొచ్చు. మరీ మీకు మల్లెపూలు పెట్టుకోవాలని అనిపిస్తే, ఎప్పుడైనా కొద్దిసేపు పెట్టుకొని తీసేయొచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. మా అమ్మకు ఇప్పుడు 44 ఏళ్లు. తనకు గత అయిదారేళ్లుగా పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు. పీరియడ్‌కి పీరియడ్‌కి మధ్య రెండు మూడు నెలల గ్యాప్ ఉంటోంది. ఒక్కోసారి 5-6 నెలల గ్యాప్ కూడా ఉంటోంది. రెండేళ్ల క్రితం ఒక డాక్టర్‌ను సంప్రదిస్తే.. ఏవో ట్యాబ్లెట్స్ ఇచ్చారు. వాటిని వాడిన తర్వాత కొన్ని నెలలు పీరియడ్స్ కరెక్ట్‌గా వచ్చాయి. తర్వాత ఎప్పటిలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అందరేమో, వయసు పెరుగుతుంది కదా. పీరియడ్స్ ఆగిపోయే ముందు అలాగే ఉంటుంది అంటున్నారు. మా అమ్మేమో ఆస్పత్రికి వెళ్దామంటే రావడం లేదు. ఆమె చాలా వీక్‌గా ఉంటుంది. దయచేసి అది నేచురల్‌గా జరుగుతోందా? లేక గర్భసంచికి సంబంధించిన సమస్య ఏమైనా ఉండటం వల్ల అలా అవుతుందా చెప్పండి. - సాగరిక, ఊరు రాయలేదు నలభై ఏళ్ల తర్వాత ఆడవారిలో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల పనితీరు తగ్గడం మొదలై, వాటి నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం మొదలవుతుంది. దానివల్ల పీరియడ్స్ క్రమం తప్పడం జరుగుతుంది. కొందరిలో వారి శరీరతత్వాన్ని బట్టి పీరియడ్స్ ఆలస్యంగా వస్తే, కొందరిలో పీరియడ్స్ త్వరగా ఎక్కువ బ్లీడింగ్‌తో రావడం ఉంటుంది. మీ అమ్మగారు బలహీనంగా ఉన్నారంటున్నారు కాబట్టి ఇంకా వేరే సమస్యలు.. అంటే రక్తహీనత, టీబీ, థైరాయిడ్ సమస్య లేదా అండాశయాలలో గడ్డలు వంటి ఎన్నో సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో 40 ఏళ్ల తర్వాత గర్భాశయంలో, అండాశయాలలో సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా మీ అమ్మగారిని తప్పనిసరిగా ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి, అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించి సమస్యను బట్టి చికిత్స చేయించండి. ఎలాంటి సమస్యా లేకపోతే పీరియడ్స్ ఆగిపోయే ముందు వచ్చే మార్పుల వల్లే అయితే, నిశ్చింతగా ఉండి బలానికి విటమిన్, కాల్షియం మాత్రలు వేసుకుంటే సరిపోతుంది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
హెర్నియా అని వస్తే...గర్భసంచి..!
హెర్నియా చికిత్సకు వచ్చిన ఓ యువకుడి కడుపులో గర్భసంచి బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిట్టిపల్లికి చెందిన అమర్నాథ్(23) కొన్ని రోజులుగా హెర్నియా(బుడ్డ)తో బాధపడుతున్నాడు. అతడు గురువారం కుప్పంలోని ప్రియా నర్సింగ్ హోంలో చికిత్స చేయించుకునేందుకు వచ్చాడు. ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి కడుపులో గర్భసంచి ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. హెర్నియాను తొలగించటంతోపాటు గర్భసంచిని బయటకు తీసి చికిత్స పూర్తి చేశారు. ఈ విషయమై ఆస్పత్రి డాక్టర్లు మాట్లాడుతూ.. ఇది చాలా అరుదైన కేసని..ప్రతి 5కోట్లలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అమర్నాథ్కు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. -
ల్యాబ్‌లో మానవ పిండాల సృష్టి
వాషింగ్టన్: మానవ అభివృద్ధి క్రమంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. తొలిసారిగా మానవ పిండాలను రెండు వారాల పాటు ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. తొందరగా గర్భస్రావం కావడానికి కారణాలు తెలుసుకోవడానికి, మానవ వికాసానికి సంబంధించి తలెత్తే అనేక ప్రశ్నలకు ఇది సమాధానం కాగలదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మానవ అభివృద్ధిలో ఫలదీకరణం తర్వాత 14వ రోజు వరకు జరిగే అణు, కణ ప్రక్రియలను ఈ పరిశోధనలో క్షుణ్నంగా పరిశీలించారు. గర్భాశయం బయట మొదటిసారిగా విజయవంతంగా ఈ ప్రక్రియను నిర్వహించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
పుట్టుకతోనే కిడ్నీ, గర్భాశయం లేదని..
బరేలి: పుట్టుకతోనే ఓ కిడ్నీ, గర్భాశయం లేదన్న విషయాన్ని 17 ఏళ్ల తర్వాత తెలుసుకున్న ఓ అమ్మాయి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈ దారుణం జరిగింది. బరేలికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని కొన్ని నెలల క్రితం అనారోగ్యంపాలైంది. ఆమె తల్లిదండ్రులు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, డాక్టర్ సలహా మేరకు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించారు. నివేదికలో ఆమెకు ఓ కిడ్నీ, గర్భాశయం లేదని తేలింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి డిప్రెషన్‌కు లోనయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మరికొందరు డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. అయినా ఆ అమ్మాయి డిప్రెషన్ నుంచి కోలుకోలేదు. గత శుక్రవారం తండ్రి ఇంట్లోలేని సమయంలో ఆ అమ్మాయి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె కేకలు వేయడంతో తల్లి ఇరుగుపొరుగు వారి సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో ఆమె మరణించినట్టు పోలీసులు తెలిపారు. -
అమ్మని కావాలనుంది... అవకాశం లేదా?!
నా వయసు 22. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 80 కిలోలు. ఇంతకు ముందు ఇంత లావు ఉండేదాన్ని కాదు. ఈ మధ్యనే ఎందుకో బాగా పెరిగాను. అలా అని వ్యాయామం లేదని కాదు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. పిల్లల వెనుక పరుగులు తీస్తూనే ఉంటాను. వెజిటేరియన్స్మి కాబట్టి నాన్‌వెజ్ కూడా తినను. అయినా ఎందుకిలా బరువు పెరుగుతున్నాను? - ఎల్.సుజాత, తాడిపత్రి మీ ఎత్తుకి 60-65 కిలోలు బరువు ఉంటే సరిపోతుంది. అంటే మీరు పదిహేను కిలోలు ఎక్కువ ఉన్నారు. అధిక బరువు తగ్గాలంటే తప్పకుండా శారీరక శ్రమ అవసరం. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఎన్ని పనులు చేసినా, దాని వల్ల పెద్దగా బరువు తగ్గరు. పొద్దున్న, సాయంకాలం నలభై అయిదు నిమిషాల నుంచి గంట పాటు వాకింగ్, యోగా వంటివి చేయండి. లేదంటే జిమ్‌కి వెళ్లండి. చెమట పట్టేంతగా శ్రమ చేసినప్పుడే ఒంట్లో కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు. అలాగే ఆహార నియమాలు పాటించండి. అన్నం తక్కువగా కూరలు ఎక్కువగా తీసుకోండి. స్వీట్లు, కొవ్వుతో కూడిన పదార్థాలు, వేపుళ్లు, నూనె వస్తువులు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇవన్నీ చేస్తూ డాక్టర్ సలహాతో కొవ్వు తగ్గడానికి మందులు కూడా వాడవచ్చు. ఉన్నట్టుండి బరువు పెరిగానంటున్నారు కాబట్టి థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలేమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవడం మంచిది. థైరాయిడ్, సీబీపీ, ఆర్బీఎస్, లిపిడ్ ప్రొఫైల్ లాంటి రక్త పరీక్షలు చెయ్యించుకుని, ఫలితాలను బట్టి మందులు వాడాలి. నా వయసు 39. ఇద్దరు పిల్లలు. ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా అయిపోయింది. ఈ మధ్య ఎందుకో నెలసరి క్రమం తప్పుతోంది. పైగా బ్లీడింగ్ కూడా సరిగ్గా అవ్వడం లేదు. ఒకటిన్నర రోజో, రెండు రోజులో అయ్యి ఆగిపోతోంది. ఆ సమయంలో కాళ్లు కూడా బాగా గుంజుతున్నాయి. మొదట్నుంచీ ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదుర్కోలేదు. ఇప్పుడెందుకిలా? - విజయలక్ష్మి, అనంతపూర్ వయసు పెరిగేకొద్దీ హార్మోన్లలో మార్పుల వల్ల, గర్భాశయంలో మార్పులు రావడం వల్ల, అండాశయాల్లో నీటి తిత్తులు, సిస్టులు ఏర్పడటం వల్ల... ఇలా కొన్ని కారణాల చేత పీరియడ్స్ క్రమం తప్పడం, బ్లీడింగ్ కొద్దిగానే అవ్వడం జరగవచ్చు. కొందరిలో మానసిక ఒత్తిడి, ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా అలా జరగవచ్చు. కొంతమందికి పీరియడ్స్ సమయంలో కాళ్లనొప్పులు, నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి వంటివి కూడా ఉంటాయి. కాబట్టి మీరోసారి గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి అవసరమైన హార్మోన్ టెస్టులన్నీ చేయించుకోండి. రక్తహీనత ఉందేమో తెలుసుకోడానికి సీబీపీ వంటి పరీక్షలు కూడా చేయించుకుంటే సమస్య ఎక్కడుందో తెలుస్తుంది. అప్పుడు తగిన చికిత్స చేయించుకోవచ్చు. నా వయసు 34. నాకు ఇరవయ్యేళ్లు ఉన్నప్పుడు పెళ్లయ్యింది. కానీ పొరపొచ్చాలు వచ్చి భర్తతో విడిపోయాను. పిల్లలు లేరు. అప్పటి నుంచీ ఒంటరిగానే ఉన్నాను. అయితే కొన్నాళ్ల క్రితం ఒక వ్యక్తి పరిచయమయ్యారు. ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకున్నాం. ఆయన వయసు 38. ఇద్దరం సంతోషంగానే ఉన్నాం. అయితే నాకు పిల్లల్ని కనాలని ఉంది. కానీ ఇప్పటికే ముప్ఫై అయిదుకు చేరువలో ఉన్నాను కాబట్టి పుడతారో లేదోనని భయమేస్తోంది. ఈ వయసులో నేను పిల్లల కోసం ప్రయత్నించవచ్చా? దాని వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఒక్క బిడ్డ కలిగినా చాలు. సలహా ఇవ్వండి. - కె.శ్రీవిద్య, సంగారెడ్డి సాధారణంగా ఆడవాళ్లలో ముప్ఫయ్యేళ్లు దాటిన తర్వాత అండాశయాల నుంచి విడుదలయ్యే అండాల నాణ్యత తగ్గడం మొదలవుతుంది. 35 యేళ్లు దాటాక ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. దానివల్ల గర్భం దాల్చడానికి ఇబ్బంది ఏర్పడవచ్చు. గర్భం దాల్చిన తర్వాత పిండం సరిగ్గా ఎదగక, అబార్షన్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. పిండంలో జన్యుపరమైన సమస్యలు ఏర్పడి, అవయవ లోపాలు ఏర్పడవచ్చు. సాధారణ జనాభాలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలు 2 శాతం ఉంటే, 30-35 సంవత్సరాల లోపల 4 శాతం, ఆ వయసు దాటాక 6 శాతం ఉంటాయి. మీకు 34 సం॥కాబట్టి తప్పకుండా గర్భం కోసం ప్రయత్నించవచ్చు. కాకపోతే సాధారణ గర్భం కోసం ఎక్కువ నెలలు ఎదురు చూడకుండా, ఆరు నెలలు ప్రయత్నించండి. ఆ సమయం దాటివుంటే ఓసారి గైనకాలజిస్టును కలిసి, అవసరమైన హార్మోన్ పరీక్షలు, స్కానింగ్ వంటివన్నీ చేయించుకోండి. ఆపైన త్వరగా గర్భం రావడానికి మందులు వాడితే మంచిది. ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతూ, గర్భం వచ్చిన తర్వాత బిడ్డలో ఏమైనా సమస్యలు ఉంటే ముందే తెలుసుకోవడానికి మూడో నెలలో ఎన్.టి.స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్, ఐదో నెలలో టిఫా స్కాన్, ట్రిపుల్ మార్కర్ టెస్ట్, ఆరో నెలల 2 డి ఫీటల్ ఎకో వంటి పరీక్షలన్నీ చేయించుకోవాలి. ఏమాత్రం అధైర్య పడకుండా ప్రయత్నించండి. తప్పకుండా మీ ఆశ నెరవేరుతుంది. నా వయసు 23. పెళ్లై నాలుగు నెలలు అవుతోంది. అప్పుడే పిల్లలు వద్దని అనుకుంటున్నాం. అందుకే మాత్రలు వాడుతున్నాను. అయితే రోజూ గుర్తు పెట్టుకుని వేసుకోవడం కష్టంగా అనిపిస్తోంది. లూప్ వేసుకుంటే బెటరని నా ఫ్రెండ్ అంది. అది ఎవరైనా వేయించుకోవచ్చా? వేసేటప్పుడు నొప్పి ఏమైనా వస్తుందా? తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఈ సందేహాలతో డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి భయపడుతున్నాను. ఏం చేయమంటారు? - కీర్తన, తాడేపల్లిగూడెం లూప్ లేదా కాపర్-టి, ఐయూసీడీ అనేది గర్భం రాకుండా గర్భాశయంలో వేసే చిన్న ప్లాస్టిక్ పరికరం. దీన్ని సాధారణంగా ఒక కాన్పు తర్వాత వెయ్యించుకుంటే మంచిదని సలహా ఇస్తుంటాం. ఎందుకంటే దీనివల్ల కొందరిలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని గుర్తించక అశ్రద్ధ చేస్తే, ట్యూబ్స్ మూసుకుపోయి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి కనీసం ఒక్క బిడ్డయినా పుట్టిన తర్వాతే దీన్ని వేయించుకోవడం మంచిది. ముందే వేయించుకుంటే ఒక కాన్పు కూడా కాలేదు కాబట్టి, గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉండి, కొద్దిగా నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. నా వయసు 28. మావారి వయసు 31. మాకు పెళ్లై ఎనిమిదేళ్లు అయ్యింది. ఇద్దరు బాబులు ఉన్నారు. రెండో బాబు వయసు ఏడాదిన్నర. వాడు పుట్టినప్పుడే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాను. కానీ ఈ మధ్య మావారు ఒక పాప ఉంటే బాగుంటుంది అంటున్నారు. నాకూ ఆయన కోరిక తీర్చాలనే ఉంది. కానీ ఆపరేషన్ అయిపోయాక అదెలా సాధ్యమవుతుంది? ఏదైనా అవకాశం ఉంటుందా? - వై.అన్నపూర్ణ, రామగుండం ఈ కాలంలో ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఇద్దరు ఉంటే చాలు. అబ్బాయిలున్నారు అమ్మాయి లేదని, లేకపోతే అమ్మాయిలున్నారు అబ్బాయి లేడని కనుకుంటూ పోతే... తర్వాతి కాలంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉన్న ఇద్దరినీ బాగా చదివించి, మంచి బుద్ధులు నేర్పించి, వాళ్లని మంచి పౌరులుగా తీర్చిదిద్దితే అంతకన్నా ఆనందం ఏముంటుంది! మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది. అయినా అమ్మాయి కోసం ప్రయత్నం చెయ్యాలని అనుకుంటుంటే... రీక్యానలైజేషన్ ఆపరేషన్ ద్వారా కట్ చేసిన ట్యూబ్‌ను మళ్లీ అతికించే ప్రయత్నం చేయవచ్చు. ఈ ఆపరేషన్ చేస్తే గర్భం వచ్చే అవకాశాలు 40 శాతం మాత్రమే ఉంటాయి. ఒకవేళ గర్భం దాల్చినా అమ్మాయే పుడుతుందన్న గ్యారంటీ లేదు కదా! పైగా ఒక్కోసారి గర్భం ట్యూబ్‌లో కూడా రావొచ్చు. అది ప్రమాదకరం. పిల్లలు లేకపోతేనో, ఒక్క బిడ్డే ఉండి ఇంకొకరు కావాలంటేనో రిస్క్ తీసుకుని ఈ ఆపరేషన్‌కు వెళ్లవచ్చు కానీ, మీరు ఇలా చేయడం అంత మంచిది కాదేమో. ఒక్కసారి ఆలోచించండి. మరీ అంతగా కావాలనుకుంటే టెస్ట్‌ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నించండి. నా వయసు 24. పెళ్లై ఏడు నెలలు అయ్యింది. ఈ మధ్య నెలసరి రాకపోవడంతో చెకప్ చేయించుకుంటే గర్భవతినని తేలింది. అయితే నేను చాలా పొట్టిగా ఉంటాను. నా గర్భసంచి కూడా చాలా చిన్నగా ఉందట. అందులో బిడ్డ సరిగ్గా ఎదగలేదు, బిడ్డను మోసే శక్తి కూడా నీ గర్భసంచికి లేదు, అబార్షన్ చేయించుకుంటే మంచిది అన్నారు డాక్టర్. నేను నా బిడ్డను చంపుకోలేను. దయచేసి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. - సునంద, అనకాపల్లి గర్భాశయం చిన్నగా ఉన్నప్పుడు... కొందరి శరీర తత్వాన్ని బట్టి, గర్భం వచ్చాక వారిలో విడుదలయ్యే హార్మోన్లను బట్టి కొద్దిగా పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే లోపల పెరిగే బిడ్డ... గర్భాశయం విచ్చుకునేదాన్ని బట్టి బరువు పెరుగుతుంది. కొందరిలో అబార్షన్లు, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఏడెనిమిది నెలల్లో కాన్పు అయిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పుడు గర్భం వచ్చేసింది కాబట్టి ప్రొజెస్టరాన్ హార్మోన్ ట్యాబ్లెట్లు, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, నెలనెలా అవసరాన్ని బట్టి స్కానింగ్ చేయించుకోండి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండి, 4, 5 నెలల్లో గర్భాశయానికి కుట్లు వేయించుకుని చూడండి. ఇంక వేరే అవకాశం లేదు కాబట్టి ముందే గర్భం తీయించుకునే బదులు, పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోండి. కనీసం బిడ్డ ఏడో నెల దాకా ఎదిగి, ఒక కిలోకి పైన బరువు పెరిగినా మంచిదే. ఇప్పుడున్న ఆధునిక చికిత్సల్లో ఎన్.ఐ.సి.యు.లో పెట్టి బిడ్డను బతికించుకునే అవకాశాలు ఉన్నాయి. అలా చేసినా ఫలితం లేనప్పుడు... కాన్పు మీద కాన్పుకి గర్భాశయం కొద్దిగా విచ్చుకుని... ఆ తర్వాత కాన్పుకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
చక్కెర వ్యాధిగ్రస్తుల వ్యాయామంలో జాగ్రత్తలు...
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. హార్మోన్ లోపం వల్ల ఆమెకు నెలసరి సరిగా రావడం లేదు. ఆమె బరువు పెరుగుతోంది. హోమియోపతిలో సరైన చికిత్స చెప్పండి. - రాజేశ్వరి, కర్నూలు మనిషి జీవించడానికి శ్వాస ఎంత ముఖ్యమో, ఆరోగ్యంగా ఉండటానికి హోర్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండం ఏర్పడినప్పట్నుంచీ జీవితాంతం హార్మోన్లు తమ ప్రభావం కలిగి ఉంటాయి. మెదడులోని హైపోథెలామస్, పిట్యూటరీ గ్రంథులు శరీర కణాల క్రమబద్ధీకరణలో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ హార్మోన్లే శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితి, నిద్ర, దాహం, ఉద్వేగాలను అదుపులో ఉంచుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రవహిస్తూ, నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇవి సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లయిన టీ3, టీ4... థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అవుతాయి. వీటిలో అసమతౌల్యత ఏర్పడితే హైపోథైరాయిడిజమ్, హైపర్‌థైరాయిడిజమ్, గాయిటర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి. అలాగే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు మహిళల్లో నెలసరి, సెకండరీ సెక్సువల్ లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవం వంటి అంశాలకు ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతౌల్యత వల్ల మహిళల్లో నెలసరి సమస్యలు, అవాంఛిత రోమాలు, సంతానలేమి వంటి సమస్యలు కనిపిస్తాయి. మెనోపాజ్, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం, కీళ్లనొప్పులు కూడా వస్తాయి. నెలసరి సరిగా రాకపోవడంతో పాటు, బరువు పెరుగుతోందని చెబుతున్నారు కాబట్టి మీ అమ్మాయిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడి ఉండవచ్చు. ముందుగా ఆమెలోని సమస్యను తెలుసుకోవాలి. అయితే మీరు చెబుతున్న లక్షణాలను చూస్తే ఆమెకు థైరాయిడ్‌కు సంబంధించిన సమస్య ఉండవచ్చని అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేస్తే ఆమెకు హోమియోలో కాల్కేరియా కార్బ్, థైరాయిజమ్ ఐయోడమ్, బ్రోమియమ్, సల్ఫర్ వంటి మంచి మందులే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఆమెను అనుభవజ్ఞులైన హోమియో వైద్యులకు చూపించండి. ఆమెకు ఉన్న వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. గత ఐదేళ్లుగా నేను డయాబెటిస్తో బాధపడుతున్నాను. చక్కెర రోగులకు వ్యాయామం అవసరమని డాక్టర్లు చెప్పారు. డయాబెటిస్ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - వి. రాము, నూతనకల్లు డయాబెటిస్ ఉన్నవారు వ్యాయామం చేయడం వల్ల మరింత మెరుగైన జీవనాన్ని సాగించగలచు.అయితే దీనికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామానికి మీ శరీరం సంసిద్ధంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇందుకోసం ముందుగా స్థూలకాయం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. గుండెజబ్బులు ఏవైనా ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవాలి. శరీరానికి ఏ మేరకు వ్యాయామం కావాలో, ఏ మేరకు సురక్షితమో కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల కూడా కొన్ని సమస్యలు రావచ్చు. వ్యాయామానికి ముందుగా మీ ఒంట్లోని చక్కెర పాళ్లు తెలుసుకోవాలి. అవి మరీ ఎక్కువగా ఉన్నా, లేదా మరీ తక్కువగా ఉన్నా, రక్తంలోనూ, మూత్రంలోనూ కీటోన్స్ ఉన్నా శరీరకంగా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయకూడదు. ఒకవేళ రక్తంలోని చక్కెరపాల్లు 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉంటే వ్యాయామానికి ముందు కాస్త ఉపాహారం తీసుకోవాలి. ఒకవేళ చక్కెర పాళ్లు త్వరత్వరగా పడిపోతుంటే తక్షణం చాక్లెట్ లాంటిది ఏదైనా తీసుకోవాలి. మన శరీరానికి, మెదడుకు అవసరమైనంత ద్రవాహారం అందేలా చేసుకోవాలి. ఇందుకోసం వ్యాయామానికి ముందర, వ్యాయామం తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి. వ్యాయమాన్ని మొదలుపెట్టడానికి తక్షణం ముందుగానూ, వెంటనే ఆ తర్వాత నీళ్లు తాగకూడదు. వాతావరణంలో చాలా ఎక్కువగా వేడి ఉన్నప్పుడు శరీరం వెంటనే అలసిపోయే వ్యాయామాలు చేయకూడదు. ఎందుకంటే కొందరిలో శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధంగా ఉంచేంత సామర్థ్యం ఉండదు. అలాంటి సందర్భాల్లో చెమటను, రక్తప్రసరణను నియంత్రించే అటనామిక్ నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే బాగా వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో ఆరుబయట వ్యాయామం చేయవద్దు. డయాబెటిస్ వల్ల ఒక్కోసారి పాదాలకు జరిగే రక్తప్రసరణ తగ్గి వాటిని అయ్యే గాయాలు తెలియకపోవచ్చు. పాదాలకు తిమ్మిర్లు (పెరిఫెరల్ న్యూరోపతి) రావచ్చు. మీ పాదాలకు ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోవాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైనా వెంటనే దగ్గరివారికి తెలియజేసేలా మీ మొబైల్‌ఫోన్‌ను వెంటే ఉంచుకోండి. మీ వ్యాయామం ప్లానింగ్‌లో మీ కుటుంబ సభ్యులనూ భాగం చేసుకోండి. ప్రతిరోజూ ఒకేలాంటి వ్యాయామాలు రిపీట్ కానివ్వకండి. ఒకరోజు బాగా శారీరక శ్రమ ఉన్నవి చేస్తే మరో రోజు తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇలా రోజువిడిచి రోజు వ్యాయామాలను మార్చుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. ఇటీవల ఎక్కువగా కీళ్లనొప్పులతో బాధపడుతున్నాను. సాధారణ కీళ్లనొప్పులే అని అంతగా పట్టించుకోలేదు. గత నాలుగు రోజులుగా కీళ్లనొప్పులతో పాటు వాపు, జ్వరం కూడా ఉంటోంది. నడుస్తున్నప్పుడు నొప్పితో సరిగా నడవలేకపోతున్నాను. రోజూ చేసుకునే పనులూ చేసుకోలేకపోతున్నాను. విశ్రాంతి తీసుకుంటే నొప్పి తగ్గినట్లు అనిపిస్తోంది. తర్వాత మళ్లీ కీళ్లనొప్పులు వస్తున్నాయి. నేను ఇదివరకెప్పుడూ ఇలాంటి లక్షణాలతో అనారోగ్యానికి గురికాలేదు. మొదటిసారి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు తగ్గిపోతాయని తెలిసినవారు చెబుతున్నారు. ఈ సమస్య ఎందుకు వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - అనసూయ, ఏలూరు మీరు తెలిపిన వివరాలను బట్టి మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థరైటిస్ ఉన్నవారిలో కీళ్లనొప్పులతో పాటు జ్వరం, వాపు కూడా ఉంటోంది. వయసు పైబడిన వారిలోనే ఆర్థరైటిస్ వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నవయసులో కూడా ఆర్థరైటిస్ బారిన పడుతున్నవారు ఉన్నారు. విశ్రాంతి తీసుకోవడం వల్ల అన్ని రకాల కీళ్ల నొప్పులు తగ్గవు. కీళ్లనప్పుల్లో చాలా రకాలు ఉంటాయి. కీళ్లనొప్పి రకాన్ని బట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ మీకు ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం ఆర్థరైటిస్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆర్థరైటిస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే దానిని సులువుగా నివారించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్‌లో చాలా రకాలు ఉంటాయి. ఆర్థరైటిస్ రకాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మీరు తెలిపిన లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కనిపిస్తాయి. దీనికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందడంతో పాటు మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. -
గైనకాలజీ కౌన్సెలింగ్
తెలుపు అవుతోంది, ప్రమాదమా? నా వయసు 24. పెళ్లికాలేదు. నాకు ప్రతిరోజూ కొంచెం తెల్లబట్ట అవుతోంది. కేవలం పీరియడ్స్ ముందు మాత్రమే అలా అవుతుంటుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇదేమైనా సమస్యకు సూచనా? ఇలా ఎందుకు అవుతోంది? నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - మను, ఈ-మెయిల్ పెళ్లికాని అమ్మాయిల్లో తెల్లబట్ట అవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయ ముఖద్వారంలో, యోనిభాగంలో మ్యూకస్గ్రంథులు ఉంటాయి. వాటి నుంచి హార్మోన్ల ప్రభావం వల్ల నీరులాంటి, వాసనలేని స్రావాలు విడుదలవుతుంటాయి. అవి ఎక్కువగా నెలసరికి ముందు, నెలసరి మధ్యలో అంటే అండం విడుదలయ్యే సమయంలో వెలువడుతుంటాయి. దీనివల్ల వాసన, దురద ఉండదు. అంతేగాక ఇది హానికరం కూడా కాదు. ఇక కొందరిలో ఫంగల్, బ్యాక్టీరియల్, ట్రైకోమొనియాసిస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వైట్ డిశ్చార్జి అవుతుంది. ఇది పెరుగులాగా, ముక్కలుగా, నురగలా, కొంచెం పచ్చగా ఉండి, దురద, మంట, వాసనతో ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కొంతమందిలో నులిపురుగులున్నా, వైట్డిశ్చార్జీ అవుతుంది. మలబద్ధకం వల్ల కూడా వైట్ డిశ్చార్జి సమస్య రావచ్చు. కొంతమందిలో రక్తహీనత వల్ల రోగనిరోధకశక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల కూడా ఇదే సమస్య రావచ్చు. ఈకాలం అమ్మాయిలు బిగుతైన దుస్తులు, జీన్స్, నైలాన్ ప్యాంటీస్ వంటివి ఎక్కువగా ధరిస్తున్నారు. దాంతో జననాంగాలకు గాలిసోకక, ఆ ప్రాంతంలో చెమట ఎక్కువగా పట్టి ఇన్ఫెక్షన్స్కు దారితీయవచ్చు. జననాంగాల వద్ద ఉండే రోమాలను రెండువారాలకొకసారి తొలగించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్లను తగ్గించుకునేందుకు కొందరు యాంటీసెప్టిక్ లోషన్స్‌తో ఆ ప్రాంతాల్లో శుభ్రం చేసుకుంటుంటారు. ఇలా యాంటీసెప్టిక్ లోషన్స్‌తో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడం సరికాదు. దానివల్ల యోనిభాగంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (లాక్టోబాసిలై) నశిస్తాయి. ఇవి యోనిలో స్రావాలు సరైన ‘పీహెచ్’ పాళ్లలో ఉండేలా చూసి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంటాయి. మీరు అక్కడ శుభ్రం చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే లాక్టోబాసిలైతో కూడిన ‘ఫెమినైన్ వాష్’లను వాడుకోవచ్చు. ఇక ఆహారంలో తీసుకునే పెరుగులో కూడా లాక్టోబాసిలై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగు, మజ్జిగ లాంటివి ఎక్కువగా వాడటం కూడా మంచిదే. లోదుస్తులుగా కాటన్ ప్యాంటీస్ వాడటం వల్ల, వాటికి చెమటను పీల్చుకునే గుణం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ అవకాశాలు తగ్గుతాయి. రాత్రివేళ ప్యాంటీస్ ధరించకుండా ఉండటం మంచిది. అవసరమైతే పగటిపూట జననాంగాల వద్ద యాంటీఫంగల్ పౌడర్ చల్లుకోవచ్చు. పుష్కలంగా మంచినీళ్లు తాగడం, తాజాపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
గర్భసంచి... ఉంచితే మంచి!
అనవసర హిస్టరెక్టమీలు అనర్థం తొమ్మిది నెలలు పెరగాల్సిన శిశువును అతి జాగ్రత్తగా ఉంచడానికి ఏర్పాటు చేసిన సంచి అది. నవమాసాల బిడ్డ కాస్తా నవజాతశిశువుగా మారి ప్రపంచంలోకి వచ్చే వరకూ ఆ బరువు కాస్తుంది. ఆ భారాన్ని మోస్తుంది. మరి ఈ సంచిని జాగ్రత్తగా ఎక్కడైనా తగిలించాలి కదా. అందుకే పొత్తికడుపులో జాగ్రత్తగా ఉండేలా రూపొందించి, కొన్ని లిగమెంట్ల సహాయంతో వెన్నుపూసకూ, పెల్విక్జోన్కూ అతికి ఉంచేలా చేసింది ప్రకృతి. అదీ ఈ సంచి మహత్యం. గర్భసంచి అని మామూలు భాషలో అందరూ పిలుచుకునే దీనికి గర్భాశయం అనే మాటనూ ఉపయోగిస్తుంటారు. శరీరంలోని అన్ని అవయవాలకూ సమస్యలు వచ్చినట్టే... ఈ సంచికీ వస్తాయి. అలా వచ్చినప్పుడు చాలామంది మహిళలు ఇక తమకు పిల్లలు పుట్టేశారు కాబట్టి దాన్ని తొలగిస్తే మేలు అనీ, దాంతో రుతుస్రావం వంటి నెలనెలా బాధలు తప్పిపోతాయనీకోరుతుంటారు. వారు కోరిందే తడవుగా కొందరు డాక్టర్లు సైతం దాన్ని తొలగించి వేస్తుంటారు. నిజానికి గర్భసంచి చేసే మంచి ఏమిటో తెలుసుకుంటే అలాంటి కోరికలు కోరరు. గర్భసంచి ఉంచడం కంటే తీసివేయడం వల్లనే మహిళకు నిజంగానే మేలు జరుగుతుందని డాక్టర్లు అనుకుంటే అప్పుడు వారే ఆ సలహా ఇస్తారు. అది ఏ పరిస్థితుల్లో జరుగుతుందో కూడా తెలుసుకుందాం. ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల పొడవు, మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ గర్భసంచి తన ఈ కొలతలకు మించి 15 రెట్లు పెరుగుతుంది. అందుకే ఒకే ఒక కణం (జైగోట్) నుంచి అనేక కోట్ల రెట్ల విభజనలు జరిగి ఒక బిడ్డగా రూపొందేవరకు బిడ్డ భారాన్ని భరిస్తుంది గర్భసంచి. దీనికి ఇరువైపులా రెండు అండాశయాలు (ఓవరీస్) ఉంటాయి. ఈ రెండూ ఒవేరియన్ లిగమెంట్స్ ద్వారా గర్భసంచికి ఇరువైపులా వేలాడుతుంటాయి. అండాశయాల నుంచి ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్, చాలా కొద్ది మోతాదులో టెస్టోస్టెరాన్ విడుదల అవుతుంటాయి. ఈ హార్మోన్లు మహిళల కండరాలనూ, ఎముకలనూ గట్టిపరుస్తాయి. గర్భసంచికి వచ్చే సమస్యలెన్నో... గర్భసంచి కూడా అన్ని అవయవాల్లాగే ఒక కీలకమైన అవయవం. అయితే మిగతా అవయవాల తరహాలోనే సమస్యలకు ఇదేమీ అతీతం కాదు. దీనికి వచ్చే సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. అంటే... గడ్డలు, ఇన్ఫెక్షన్లు, వాపులు, పుండ్లు, గర్భాశయ కేన్సర్, గర్భసంచి కిందికి జారిపోవడం, అధికంగా రక్తస్రావం కావడం వంటి ఎన్నో సమస్యలు రావచ్చు. అయితే చాలారోజుల క్రితం వరకూ గర్భసంచికి ఎలాంటి సమస్య వచ్చినా... పిల్లలు పుట్టిన మహిళలు దీన్ని తొలగించుకోవడమే మంచి మార్గమని అనుకునేవారు. కాలక్రమంలో అది అంత మేలైన మార్గం కాదని తెలిసింది. హిస్టరెక్టమీ అంటే ఏమిటి? దాని తర్వాత వచ్చే పరిణామాలేమిటి? గర్భసంచి లేదా గర్భాశయాన్ని తొలగించే ఆపరేషన్‌ను ఇంగ్లిష్‌లో ‘హిస్టరెక్టమీ’ అంటారు. గర్భాశయాన్ని తొలగించే సమయంలో దానికి ఆనుకొని ఉన్న అండాశయాలనూ (ఓవరీస్నూ) కొన్నిసార్లు తొలగిస్తారు. కేవలం గర్భాశయాన్ని మాత్రమే తొలగించి, అండాశయాలను (ఓవరీస్‌ను) ఉంచినా, అండాశయాలకు రక్తాన్ని అందించే రక్తనాళాలు కొన్ని ఈ శస్త్రచికిత్సలో కట్ అవుతాయి. దాంతో వాటికి రక్తప్రసరణ తగ్గి, అవి పనిచేసే తీరు మందగిస్తుంది. ఫలితంగా వాటి నుంచి విడుదలయ్యే హార్మోన్లు కొద్దికాలంలోనే తగ్గిపోతాయి. అండాశయాలను తొలగించకుండా అలా వదిలేస్తే, కొంతమందిలో అండాశయాల్లో కంతులు ఏర్పడవచ్చు. చాలా కొద్దిమందిలో (కేవలం ఒక శాతం మందిలో మాత్రమే) అండాశయ కేన్సర్ కూడా రావచ్చు. ఆ లక్షణాలు బయటపడేలోపే అది అడ్వాన్స్డ్ దశలోకి చేరవచ్చు. ఈ పరిణామానికే భయపడి, చాలామంది ఆరోగ్యంగా ఉన్న అండాశయాలను కూడా తొలగింపజేసుకుంటారు. సాధారణంగా ముట్లు ఆగిపోవడాన్ని ‘మెనోపాజ్’ అంటారు. ఈ సమయంలో అండాశయం నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గిపోతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. ఇది సాధారణంగా 45-55 ఏళ్ల మధ్యకాలంలో జరుగుతుంది. గర్భాశయాన్నీ, అండాశయాలనూ తొలగిస్తే కూడా ఇదే పరిణామం సంభవిస్తుంది. అయితే శస్త్రచికిత్స తర్వాత జరిగే ఈ పరిణామాన్ని ‘సర్జికల్ మెనోపాజ్’ అంటారు. సాధారణ మెనోపాజ్‌లో హార్మోన్స్ మెల్లగా తగ్గటం వల్ల వాటి లక్షణాలు అంత తీవ్రంగా ఉండవు. కానీ సర్జికల్ మెనోపాజ్‌లో హార్మోన్స్ అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల... దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సర్జికల్ మెనోపాజ్ వల్ల సంభవించే పరిణామాలు ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రావాలు తగ్గడం లేదా ఆగిపోవడం వల్ల మహిళలలో ఈ కింది పరిణామాలు సంభవిస్తాయి. శరీరం నుంచి వేడి ఆవిర్లు వచ్చినట్లుగా అనిపిస్తుంది. వీటిని హాట్‌ఫ్లషెస్ అంటారు. ఉన్నట్లుండి జ్వరం వచ్చినట్లు, అంతలోనే చలిగా ఉన్నట్లు, ఫ్యాన్/ఏసీ వేసి ఉన్నా చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కండరాలు శక్తిని కోల్పోతాయి. ఎప్పుడూ నీసరం, అలసట, ఒంటినొప్పులు ఉంటాయి ఎముకలు బలహీనపడి, పెళుసుగా మారి, నడుంనొప్పి, కీళ్లనొప్పులు, దీర్ఘకాలంలో చిన్న దెబ్బకు సైతం ఎముకలు తేలిగ్గా విరిగిపోవడం వంటివి జరుగుతాయి యోని లోపల చెమ్మ తగ్గి, పొడిదనం పెరగడం వల్ల మూత్రసంబంధ సమస్యలు వస్తాయి. అంటే మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్లు రావడం, అక్కడి కండరాల పటుత్వం తగ్గడం వల్ల మహిళ ప్రమేయమే లేకుండా మూత్రం పడిపోవడం, తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ కావడం జరగవచ్చు యోనిలో ఇన్ఫెక్షన్స్, లైంగిక కలయికలో నొప్పి టెస్టోస్టెరాన్ హార్మోన్ పాళ్లు తగ్గడం వల్ల లైంగిక వాంఛలు తగ్గడం, సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం మెదడు చురుకుదనం కోల్పోతుంది. డిప్రెషన్, కోపం, చిరాకు వంటివి కనిపిస్తాయి. ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత గర్భాశయానికి వచ్చే సమస్యలకు ఇటీవల అనేక కొత్త పద్ధతులు, వినూత్నమైన చికిత్సా ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో గర్భాశయం తీయకుండానే అనేక సమస్యలకు చికిత్సలు చేయవచ్చు. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితే వస్తే... అప్పుడు వచ్చే దుష్పరిణామాలను తగ్గించుకునేందుకు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) వంటి చికిత్సలను డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవచ్చు. ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను దీర్ఘకాలం తీసుకున్నా, కొన్ని దుష్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం, అవసరమైతే సెకండ్ ఒపీనియన్‌కు వెళ్లడం మంచిది. మరి నిజంగానే గర్భాశయం ఎప్పుడు తొలగించాలి? గర్భాశయంలో కంతులు ఏర్పడి, వాటి వల్ల కలిగే లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గర్భాశయం జారినప్పుడు ఎండోమెట్రియాసిస్ అనే సమస్య సివియర్ దశలో ఉండి, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అండాశయంలో కంతులు వచ్చినప్పుడు అధిక రక్తస్రావం అవుతూ మందులతో దాన్ని అరికట్టలేనప్పుడు గర్భాశయ క్యాన్సర్ లేదా అండాశయ క్యాన్సర్ వచ్చినప్పుడు మాత్రమే గర్భాశయాన్ని తొలగించే హిస్టరెక్టమీ చేయించాలి. ఏ సమస్య అయినా దాని లక్షణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉండి, మందులు, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల వల్ల తగ్గనప్పుడు మాత్రమే ఆపరేషన్‌ను ఎంచుకోవడం మంచిది.