మహిళ గర్భాశయం నుంచి తొలగించిన కణితి
సాక్షి, లంగర్‌హౌస్: ఓ మహిళ గర్భాశయం నుంచి 3 కిలోల కణితిని లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆస్పత్రి వైద్యులు విజయంవంతంగా తొలగించారు. ఏపీలోని గుంటూరుకు చెందిన మహిళ 15 సంవత్సరాల క్రితం గర్భాశయ ముఖం ద్వారా క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు. అయితే కొంత కాలంగా ఆమెకు కడుపులో తీవ్రమైన నొప్పి, కడుపు ఉబ్బడం, వెన్నెముక నొప్పి తదితర కారణాలతో బాధపడుతోంది. దీంతో బంధువులు ఆమెను లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు.
ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భాశయంలో పెద్ద కణితి ఉందని చెప్పారు. అనంతరం వైద్యులు డాక్టర్ రాజాశ్రీ, ఆంకో సర్జన్ డాక్టర్ సంజయ్‌ల ఆమెకు విజయవంతంగా సర్జరీ చేసి మూడు కిలోల బరువున్న కణితిని తొలగించారు. కాగా గర్భాశయంతో పాటు కణజాలంలో వ్యాపించిన ట్యూమర్ అవశేషాలను కూడా తొలగించామని వైద్యులు తెలిపారు. ఎటువంటి పోస్టు ఆపరేటివ్ ఇబ్బందులు లేకుండా పేషెంట్ పూర్తిగా కోలుకున్నారని, ఆమెను డిశ్చార్చి చేశామని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment