గర్భాశయంలో సూదిని వదిలేశారు! | Delhi docters needle is left in the uterus | Sakshi
Sakshi News home page

గర్భాశయంలో సూదిని వదిలేశారు!

Published Mon, Jun 12 2017 8:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

గర్భాశయంలో సూదిని వదిలేశారు!

గర్భాశయంలో సూదిని వదిలేశారు!

► ఢిల్లీలోని శ్రీజీవన్‌ ఆసుపత్రి వర్గాల నిర్వాకం
► ఆస్పత్రికి రూ.30 లక్షలు జరిమానా విధించిన డీఎస్‌సీఆర్‌సీ

న్యూఢిల్లీ: ఓ ఆసుపత్రికి ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల వివాదపరిష్కార సంస్థ (డీఎస్‌సీఆర్‌సీ) 30 లక్షలు జరిమానా విధించింది. ఢిల్లీలోని శ్రీజీవన్‌ ఆసుపత్రిలో 2009లో ఓ మహిళ ప్రసూతి చికిత్స చేయించుకోగా.. ఆమె గర్భాశయంలో ఓ సూదిని సిబ్బంది అలాగే వదిలేశారు. కొన్నినెలల తర్వాత ఈ విషయం బయటపడింది. గర్భాశయం దెబ్బతిని ఆమె మరోసారి గర్భం ధరించలేని స్థితికి చేరుకుంది.

దీనిపై బాధితురాలు జిల్లా వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించగా.. ఆమెకు రూ.3 లక్షలు పరిహారంగా అందించాలని ఆసుపత్రిని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని డీఎస్‌సీఆర్‌సీలో సవాలు చేసిన ఆసుపత్రికి.. తాజాగా అక్కడా చుక్కెదురైంది. జిల్లా సంఘం నిర్ణయాన్ని సమర్థించిన డీఎస్‌సీఆర్‌సీ.. 30 లక్షలు రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధిలో డిపాజిట్‌ చేయాలని ఆసుపత్రిని ఆదేశించింది. వైద్యుడికి బదులుగా ఫార్మసిస్టు మహిళకు ప్రసూతి చికిత్సచేశాడని ఈ తరహా ఇబ్బందులు ఎంతమందికో ఎదురై ఉండవచ్చని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement