దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల్లో ఉత్సాహం కూడా పెరుగుతోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇంతలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ)కు చెందిన ఒక ఆసక్తికర వార్త వైరల్‌గా మారింది.
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ రెండవ కుమార్తె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రోహిణి ఇటీవల తన అత్తా మామల ఇంటికి బీహార్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కారాకాట్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఆమె ఎంపీగా ఎన్నికైతే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వారంటున్నారు.
తొలుత ఆమె ఈ వినతిని తిరస్కరించినా తాను తల్లిదండ్రులు మాటకు కట్టుబడి ఉంటానని మీడియాకు తెలియజేశారు. కారాకాట్ ప్రజలు తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకంటే తనకు అభ్యంతరం చెప్పలేనని అమె అన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ సంతానమైన తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్, మిసా భారతి ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రోహిణి ఆచార్య.. సోషల్ మీడియాలో బీహార్ రాజకీయాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. రోహిణి తన కిడ్నీలో ఒకదానిని తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు దానం చేయడంతో అందరి దృష్టిలో పడ్డారు. ఆమె ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే ఇంజనీర్ సమేష్‌ని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె భర్త, కుటుంబంతో కలిసి సింగపూర్‌లో ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీని కబళించిన చలి పులి.. పొగమంచుతో తగ్గిన విజిబులిటీ!
Comments
Please login to add a commentAdd a comment