తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం | Six Of Family Killed In UP House Fire | Sakshi
Sakshi News home page

తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం

Published Fri, Jun 16 2023 6:11 AM | Last Updated on Fri, Jun 16 2023 6:11 AM

Six Of Family Killed In UP House Fire  - Sakshi

కుషినగర్‌(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని కుషినగర్‌ జిల్లాలో బుధవారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో నిద్రిస్తున్న తల్లి, అయిదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులంతా 1–10 ఏళ్లలోపు వారే. ఉర్ధా గ్రామానికి చెందిన సంగీత, ఆమె అయిదుగురు పిల్లలు ఇంట్లో పడుకోగా, ఆమె భర్త, అతడి తల్లిదండ్రులు ఆరు బయట నిద్రించారు.

గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకోవడంతో ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. సంగీత భర్త వారిని కాపాడేందుకు ప్రయత్నించినా మంటల తీవ్రత కారణంగా వీలు కాలేదు.సంగీతతోపాటు ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు వయస్సున్న చిన్నారులు మంటలకు ఆహుతయ్యారు. ఫైరింజన్‌ వచ్చే సరికే ఈ ఘోరం జరిగిపోయింది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement