పెళ్లికి నిరాకరణ, రెచ్చిపోయిన ప్రేమోన్మాది | Two Person Died In House Firing In Dulla | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ పోసి ఇంటికి నిప్పు; ఇద్దరు సజీవ దహనం

Published Wed, Jan 22 2020 8:21 AM | Last Updated on Wed, Jan 22 2020 11:58 AM

Two Person Died In House Firing In Dulla - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : తనతో పెళ్లికి నిరాకరించిందని ఒక ప్రేమోన్మాది తన ప్రియురాలి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన బుధవారం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారి, మరొక వ్యక్తి సజీవ దహనమాయ్యరు. వివరాల్లోకి వెళితే.. మాదాల శ్రీనివాస్‌ దుళ్లలో ఉంటున్న తన మేనత్త సత్యవతి కుమార్తెను ప్రేమ పేరుతో నిత్యం యువతిని వేధించేవాడు. పెళ్లి చేసుకుంటానని నాలుగు నెలలుగా వెంటపడడంతో యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఇరు కుటుంబల మధ్య అప్పటినుంచి కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సత్యవతి తన కూతురును మరో యువకుడికి ఇచ్చి వాహం జరిపించారు. దీంతో తనతో పెళ్లి జరిపించకపోవడంతో శ్రీనివాస్‌ యువతి కుటుంబంపై కక్ష పెంచుకొని హతమార్చాలని భావించాడు.

ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ మంగళవారం అర్థరాత్రి 1.30 గంటకు దుళ్ల గ్రామ శివారులో ఉన్నపెట్రోల్‌ బంకులోకి బాటిల్‌లో పెట్రోల్‌ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కాగా నాలుగు రోజుల క్రితం దుళ్లకు వచ్చిన శ్రీనివాస్‌ తన మేనత్త సత్యవతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కడియం పోలీసులకు శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే శ్రీనివాస్‌ తన అత్త సత్యవతి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అప్పటికే గాడ నిద్రలో ఉండడంతో ఐదేళ్ల చిన్నారి విజయలక్ష్మితో పాటు చిన్నారి మేనమామ కోటాను రాము సజీవ దహనం కాగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను, గాయపడిన వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. కాగా దుండగుడు  శ్రీనివాస్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement