dulla
-
పెళ్లికి నిరాకరణ, రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సాక్షి, తూర్పు గోదావరి : తనతో పెళ్లికి నిరాకరించిందని ఒక ప్రేమోన్మాది తన ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన బుధవారం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారి, మరొక వ్యక్తి సజీవ దహనమాయ్యరు. వివరాల్లోకి వెళితే.. మాదాల శ్రీనివాస్ దుళ్లలో ఉంటున్న తన మేనత్త సత్యవతి కుమార్తెను ప్రేమ పేరుతో నిత్యం యువతిని వేధించేవాడు. పెళ్లి చేసుకుంటానని నాలుగు నెలలుగా వెంటపడడంతో యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఇరు కుటుంబల మధ్య అప్పటినుంచి కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సత్యవతి తన కూతురును మరో యువకుడికి ఇచ్చి వాహం జరిపించారు. దీంతో తనతో పెళ్లి జరిపించకపోవడంతో శ్రీనివాస్ యువతి కుటుంబంపై కక్ష పెంచుకొని హతమార్చాలని భావించాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ మంగళవారం అర్థరాత్రి 1.30 గంటకు దుళ్ల గ్రామ శివారులో ఉన్నపెట్రోల్ బంకులోకి బాటిల్లో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కాగా నాలుగు రోజుల క్రితం దుళ్లకు వచ్చిన శ్రీనివాస్ తన మేనత్త సత్యవతిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కడియం పోలీసులకు శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగానే శ్రీనివాస్ తన అత్త సత్యవతి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్పటికే గాడ నిద్రలో ఉండడంతో ఐదేళ్ల చిన్నారి విజయలక్ష్మితో పాటు చిన్నారి మేనమామ కోటాను రాము సజీవ దహనం కాగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను, గాయపడిన వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. కాగా దుండగుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు -
‘జూనియర్ ఎమ్మెస్’ అనడం బాగుంది..
కడియం : తనను ‘జూనియర్ ఎమ్మెస్’గా సినీవర్గాలు పిలవడం ఆనందంగా ఉందని ‘జబర్దస్త్ శేషు’ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని దుళ్ళలో శుక్రవారం ఆయన సందడి చేశారు. సోదరుడు అద్దంకి శ్రీనివాస్ గృహప్రవేశానికి కుటుంబసమేతంగా వచ్చిన శేషు.. తనవైన పంచ్ డైలాగ్‌లతో బంధుమిత్రులను నవ్వించారు. ఈ సందర్భంగా శేషు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ‘కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మామ, బాబు బంగారం’ చిత్రాల్లో చేసిన పాత్రలు మంచి గుర్తింపునిచ్చాయన్నారు. సాయిధరమ్‌తేజ, రాజ్‌తరుణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రాలతోపాటు, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఇలాంటి మంచి పాత్రలనే పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ‘వైశాఖం, మిస్టర్’ చిత్రాలతో కలిపి 8 సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు.తాను నేర్చుకున్న మిమిక్రీ జబర్దస్‌్తలో, సినిమాల్లో నటించేందుకు బాటలు వేసిందన్నారు. వస్తున్న మంచి పాత్రల ద్వారా జనంలో గుర్తింపు వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు స్థానికులు ఉత్సాహపడ్డారు.