‘జూనియర్‌ ఎమ్మెస్‌’ అనడం బాగుంది.. | junior ms seshu | Sakshi
Sakshi News home page

‘జూనియర్‌ ఎమ్మెస్‌’ అనడం బాగుంది..

Published Fri, Aug 26 2016 8:59 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

‘జూనియర్‌ ఎమ్మెస్‌’ అనడం బాగుంది..

‘జూనియర్‌ ఎమ్మెస్‌’ అనడం బాగుంది..

కడియం : తనను ‘జూనియర్‌ ఎమ్మెస్‌’గా సినీవర్గాలు పిలవడం ఆనందంగా ఉందని ‘జబర్దస్త్‌ శేషు’ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని దుళ్ళలో శుక్రవారం ఆయన సందడి చేశారు. సోదరుడు అద్దంకి శ్రీనివాస్‌ గృహప్రవేశానికి కుటుంబసమేతంగా వచ్చిన శేషు.. తనవైన పంచ్‌ డైలాగ్‌లతో బంధుమిత్రులను నవ్వించారు.

ఈ సందర్భంగా శేషు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ‘కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మామ, బాబు బంగారం’ చిత్రాల్లో చేసిన పాత్రలు మంచి గుర్తింపునిచ్చాయన్నారు. సాయిధరమ్‌తేజ, రాజ్‌తరుణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రాలతోపాటు, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఇలాంటి మంచి పాత్రలనే పోషిస్తున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ‘వైశాఖం, మిస్టర్‌’ చిత్రాలతో కలిపి 8 సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు.తాను నేర్చుకున్న మిమిక్రీ జబర్దస్‌్తలో, సినిమాల్లో నటించేందుకు బాటలు వేసిందన్నారు. వస్తున్న మంచి పాత్రల ద్వారా జనంలో గుర్తింపు వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు స్థానికులు ఉత్సాహపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement