భారీ అగ్నిప్రమాదం..22 మంది మృతి
భారీ అగ్నిప్రమాదం..22 మంది మృతి
Published Sun, Jul 16 2017 12:04 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
బీజింగ్: చైనాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిన్‌హువా పట్టణంలోని ఓ ఇంట్లో ఉదయం 4.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అందరూ గాడ నిద్రలో ఉండటంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ ఇంట్లో 25 మందికి పైగా అద్దెకు ఉంటున్నట్లు లోకల్ మీడియా పేర్కొంది.
Advertisement
Advertisement