
శాంతయ్య, సుశీల (ఫైల్)
మంచిర్యాలక్రైం: జీవితాంతం తోడుంటానని పెళ్లి నాడు అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త.. చావులోనూ భార్యకు తోడ య్యాడు. వయసు పైబడి అనారోగ్యంతో భార్య మరణించగా.. జీవిత చరమాంకంలో ఆమెలేని లోకంలో ఉండలేక.. పిల్లలకు భారం కాలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై తైసినొద్దీన్ కథనం ప్రకారం.. మంచిర్యాలలోని ఎడ్లవాడకు చెందిన మేర్గు శాంతయ్య(85), సుశీల(75) దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
అందరి పెళ్లిళ్లు కావడంతో వేరేచోట ఉంటున్నారు. కుమా రుడు నెహ్రూ కుటుంబంతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సుశీల కొన్నేళ్లుగా నరాల బలహీనతతో బాధపడుతూ ఇంటి వద్దనే వైద్యం చేయించుకుం టోంది. అనారోగ్యం తీవ్రం కావడంతో గత ఏడాది కోమాలోకి వెళ్లిపో యింది. సింగరేణిలో కార్మికుడిగా పదవీ విరమణ పొందిన శాంతయ్య సుశీలకు సే వలు చేస్తుండేవాడు. కాగా, ఇం టిపని సు శీల బాగోగులు చూసుకోవడానికి కుమారు డు నెహ్రూ, ఓ మహిళను నియమించాడు.
రోజూమాదిరిగానే ఆమె శుక్రవారం ఉద యం పనులు చేసేందుకు ఇంటికి రాగా.. తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా శాంతయ్య వెంటిలేటర్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. పడక గదిలోకి వెళ్లి చూడగా సుశీల మృతిచెందినట్లు గుర్తించింది. పొరుగువారికి ఈ విషయం చెప్పడంతో వారు కుమారుడు నెహ్రూ, పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment