సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కరోనా కలకలం రేపింది. హాజీపూర్ మండలం రాపెళ్లి గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబైకి వలస కూలీలుగా వెళ్లిన వీరు మే 5వ తేదీన స్వస్థలాలకు తిరిగివచ్చారు. అయితే వీరు ముంబై నుంచి రావడంతో హాజీపూర్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోం క్వారంటైన్ చేశారు. అయితే రెండు రోజుల క్రితం వారిలో కరోనా లక్షణాలు ఉండటంతో.. వారిని బెల్లంపల్లి ఐసోలేషన్‌కు తరలించారు. అనంతరం వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలు పంపించారు. శనివారం రాత్రి ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: లక్షణాలు స్వల్పంగా ఉంటే ఇంటి వద్దే చికిత్స..)
కాగా, జిల్లాలోని చెన్నూర్ మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళకు చనిపోయిన అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె కాంటాక్ట్‌లో ఉన్నవారికి పరీక్షలు నిర్వహించగా వారందరికీ నెగిటివ్‌గా తెలింది. ఆ తర్వాత నుంచి జిల్లాలో ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు. తాజాగా ముంబై నుంచి స్వస్థలాలకు వచ్చిన వలస కూలీలకు కరోనా సోకడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment