పక్షులను తిలకిస్తున్న సందర్శకులు
జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో రెండురోజులు నిర్వహించిన బర్డ్ వాక్ ఆదివారం ముగిసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షిప్రేమికులకు అటవీ అధికారులు శనివారం రాత్రి కామన్‌పల్లి వాచ్‌టవర్, ఘనిశెట్టికుంటల్లో బస ఏర్పాటు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, జిల్లాలతోపాటు జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్, ఫైనార్ట్స్ వర్సిటీ, హైదరాబాద్ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బర్డ్‌వాక్ లో పాల్గొన్నారు.
ఆదివారం ఉదయం ఆరు గంటలకు పక్షి ప్రేమికులు కల్పకుంట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అరుదైన పక్షులను వారు తమ కెమెరాల్లో బంధించారు. ఆసియా, ఐరోపా ఖండాలలో సంచరించే పక్షులు ఇక్కడ కనిపించడం అదృష్టమని హైదరాబాద్‌కు చెందిన ఇర్షాద్, కిశోర్, ఢిల్లీకి చెందిన ఆనందిత తెలిపారు.
వివిధ రకాల అరుదైన పక్షులను కవ్వాల్ అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి మైసమ్మ కుంట, ఘనిశెట్టి కుంట ప్రాంతాలలో పర్యటించి అరుదైన పక్షుల ఫొటోలు తీసుకున్నారు. బర్డ్ వాచర్లకు ఎఫ్‌డీవో మాధవరావు, రేంజ్ అధికారులు హఫీజొద్దీన్, రత్నాకర్‌రావు ఏర్పాట్లు చేశారు. అనంతరం గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బర్డ్ వాచర్ల అనుభవాలను తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment