Bird Watching Tours
-
అడవంతా తిరిగి.. పక్షులను తిలకించి..
జన్నారం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్లో ఆదివారం బర్డ్‌వాక్ ఉల్లాసంగా సాగింది. బిహార్, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల నుంచి 15 మంది బర్డ్ వాచర్లు వచ్చారు. శనివారం జన్నారం చేరుకున్న బర్డ్ వాచర్లకు రేంజ్ పరిధిలోని బైసన్‌కుంటలో రాత్రి బస కలి్పంచారు. ఆదివారం ఉదయమే సమీపంలోని అడవంతా తిరుగుతూ పక్షులను తిలకించారు. అరుదైన వివిధ రకాల పక్షులను కెమెరాలో బంధించారు. కొందరు బైనాక్యులర్‌తో పక్షులను తిలకించి మురిసిపోయారు. సఫారి ద్వారా మల్యాల వాచ్ టవర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా పక్షులను ఫొటోలు తీశారు. ఉన్నతాధికారులు, జిల్లా అటవీశాఖ అధికారి శివ్‌ఆశి‹Ùసింగ్ ఆదేశాల మేరకు జన్నారం అటవీ రేంజ్ అధికారి సుష్మారావు అధ్వర్యంలో బర్డ్‌వాక్ జరిగింది. ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ బర్డ్‌వాక్‌ను పరిశీలించారు. డీఆర్వో తిరుపతి, సిబ్బంది సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బర్డ్‌వాక్‌లో 60 రకాల పక్షులను గుర్తించినట్లు పలువురు తెలిపారు. -
పక్షుల వయ్యారంవీక్షకుల విహారం..
జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో రెండురోజులు నిర్వహించిన బర్డ్ వాక్ ఆదివారం ముగిసింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షిప్రేమికులకు అటవీ అధికారులు శనివారం రాత్రి కామన్పల్లి వాచ్‌టవర్, ఘనిశెట్టికుంటల్లో బస ఏర్పాటు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, జిల్లాలతోపాటు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్, ఫైనార్ట్స్ వర్సిటీ, హైదరాబాద్ ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కామారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బర్డ్‌వాక్ లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటలకు పక్షి ప్రేమికులు కల్పకుంట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అరుదైన పక్షులను వారు తమ కెమెరాల్లో బంధించారు. ఆసియా, ఐరోపా ఖండాలలో సంచరించే పక్షులు ఇక్కడ కనిపించడం అదృష్టమని హైదరాబాద్‌కు చెందిన ఇర్షాద్, కిశోర్, ఢిల్లీకి చెందిన ఆనందిత తెలిపారు. వివిధ రకాల అరుదైన పక్షులను కవ్వాల్ అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి మైసమ్మ కుంట, ఘనిశెట్టి కుంట ప్రాంతాలలో పర్యటించి అరుదైన పక్షుల ఫొటోలు తీసుకున్నారు. బర్డ్ వాచర్లకు ఎఫ్‌డీవో మాధవరావు, రేంజ్ అధికారులు హఫీజొద్దీన్, రత్నాకర్‌రావు ఏర్పాట్లు చేశారు. అనంతరం గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బర్డ్ వాచర్ల అనుభవాలను తెలుసుకున్నారు. -
వావ్.. వాటే బర్డ్
సాక్షి, విశాఖపట్నం: ఒకటి కాదు.. రెండు కాదు.. 30 రకాలకు చెందిన స్వదేశీ, వలస పక్షుల్ని చూసి వారంతా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. స్టింట్స్.. గుల్స్.. ఇలా.. విభిన్న రకాల పక్షులతో ఓ రోజంతా గడుపుతూ సరికొత్త అనుభూతికి గురయ్యారు. మెరైన్ ఫెస్టివల్–2021 మూడో ఎడిషన్‌లో భాగంగా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్(డబ్ల్యూడబ్ల్యూఎఫ్), వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(డబ్ల్యూసీటీఆర్‌ఈ) సంయుక్తంగా షోర్ బర్డ్ వాచింగ్ వాక్ సెషన్‌ని తగరపువలసలో ఆదివారం నిర్వహించారు. ఈ వాక్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సీనియర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సుధా ప్రారంభించారు. 4 ఏళ్ల నుంచి 50 ఏళ్లు పైబడిన వారు వాక్‌లో పాల్గొని ప్రకృతి అందాల్ని తిలకిస్తూ.. పక్షుల్ని చూస్తూ సరదాగా గడిపారు. వైజాగ్‌లో శీతాకాలంలో కనిపించే పక్షుల వైవిధ్యం గురించి డబ్ల్యూసీటీఆర్‌ఈ బయాలజిస్ట్ భాగ్యశ్రీ వివరించారు. అరుదైన పక్షుల ఉనికి, వాటి ప్రాముఖ్యత, జీవిత చక్రం, పర్యావరణంతో వాటికున్న అనుబంధం గురించి ప్రజలకు చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
బర్డ్ లవర్స్
ఎప్పుడు చూసినా పని.. పని. దానితో బిల్డయ్యే ఒత్తిడి. కాదంటే... ట్రాఫికర్.. కూడా వచ్చే పొల్యూషన్. ప్రకృతిలోని అందాలు మాయమై... ఆహ్లాదం ఆవిరైన కాంక్రీట్ జంగిల్లో ఇంతకంటే ఏం ఊహించగలం! పచ్చదనపు పరిమళాలు... వాటిపై విహరించే పక్షి జాతులు... ఓహ్! తలుచుకొంటేనే అర్థమవుతుంది ఎంతగా మిస్సవుతున్నామో సహజ సౌందర్యాన్ని. సిటీవాసుల ఊహలకే పరిమితమైన ఈ ‘అందాన్ని’ అలా అలా ఉల్లాసంగా ఆసాంతం ఆస్వాదించేయవచ్చంటుంది ‘బర్డ్ వాచర్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’. ముప్ఫై నాలుగేళ్ల కిందట నగరంలో ప్రారంభించిన ఈ సొసైటీ సభ్యులు రెగ్యులర్‌గా బర్డ్ వాచింగ్ టూర్స్‌కు వెళ్లి.. పక్షుల కిలకిలా రావాలతో మైమరిచిపోతున్నారు. ప్రపంచంలో బాగా పాపులర్ హాబీ... పక్షులను వీక్షించడం. పక్షుల్లో పది వేలకు పైగా జాతులున్నాయనేది అంచనా. దానికి తగ్గట్టుగానే వాటి ప్రేమికులు... పరిశీలకులూ ఉన్నారు. అమెరికాలో అయితే ప్రతి ఐదుగురిలో ఒకరు బర్డ్ వాచర్! భారత్‌లోనూ ప్రతి నగరంలో ఈ సొసైటీలున్నాయి. కొత్త పక్షి జాడ కనుక్కోవడం, వాటిని తొలిసారి చూసిన అనుభూతి పంచుకోవడం వీరి ప్రధాన యాక్టివిటీ. 1980లో ఆశిశ్ పిట్టి, తేజ్ కుమార్, షాఫాత్ ఉల్లా తదితర పక్షి, పర్యావరణ ప్రేమికులు కొందరు కలిసి బీఎస్‌ఏపీ ప్రారంభించారు. ‘ప్రపంచ పక్షి జాతుల్లో 12 శాతం.. అంటే దాదాపు 1000 రకాలు భారత్‌లో ఉన్నాయి. 20 గ్రాముల బరువుండే తేనె పిట్ట నుంచి 5 కేజీల బరువుండే రాబందు వరకు వీటిలో భాగమే. ఇదీ లెక్క... ఇంగ్లాండ్, అమెరికాల్లోని బర్డ్ సొసైటీలు వందల ఏళ్ల నాటివి. వారిలా మన వద్ద పక్షులకు సంబంధించిన కచ్చితమైన రికార్డులుండవు. నాకు గుర్తున్నవరకు... 1960లో బాలానగర్ దాటితే వైల్డ్లైఫ్లోకి ఎంటర్ అయినట్టే. ఇప్పుడు ల్యాంకోహిల్స్ ప్రాంతంలో కాజాగూడా, టోలీచౌకీలో చిరుతపులి కనపడటం అప్పుడు సాధారణం. సిటీ విస్తరిస్తున్నప్పుడు అడవులు అంతరించటమూ సహజమే. ఈ క్రమంలో చెరువులూ మాయమయ్యాయి. ఫలితంగా... వాటిని ఆధారంగా చేసుకున్న జీవులు కూడా మాయమవుతాయి. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టు పక్కల 100- 120 రకాల పక్షులు చూడగలం. 1990లో ఇళ్ల చుట్టూ కింగ్‌ఫిషర్ సహా ఒక డజన్ పక్షులు కనిపించేవి. ఇప్పుడు బుల్బుల్ , తేనెపిట్ట మినహా వేరే కనిపిం చటం లేదు’ అంటారు బీఎస్‌ఏపీ హానరీ సెక్రటరీ షాఫత్ఉల్లా. నెలలో ఓ ఆదివారం... ప్రతినెలా ఒక ఆదివారం తప్పకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో బర్డ్ వాచింగ్ టూర్ ఉంటుంది. జూ, నర్సాపూర్ అడవి, అనంతగిరి హిల్స్, పోచారం, గండిపేట్, షామీర్పేట్, హిమాయత్‌సాగర్... ఇలా విజిట్ చేసి అక్కడి పక్షులు, వాతావరణానికి ముప్పు కలిగించే అంశాలుంటే వెంటనే అటవీ శాఖవారికి సమాచారం ఇస్తారు ఈ సొసైటీ సభ్యులు. అలాగే వారంలో ఓ రోజు జర్మన్ సెంటర్ సహకారంతో అక్కడ పక్షులు, పర్యావరణానికి సంబంధించిన చిత్రాలు, పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ల వంటివి నిర్వహిస్తారు. ఏటా జనవరిలో రాష్ట్రంలోని వెట్ ల్యాండ్స్ సర్వే చేస్తారు. ఈ వివరాలన్నింటితో ‘పిట్ట’ అనే ఓ ఆన్లైన్ మ్యాగజైన్ కూడా ముద్రిస్తున్నారు. లివ్.. లెట్ లివ్... జంతువులు, పక్షులకు కూడా మనలాగే భూమి మీద బతికే హక్కు ఉంది. అనేక కారణాలతో వాటి ఆవాసాలు మాయమవుతున్నాయి. అవి ఎక్కడా ఆవాసం ఏర్పరచుకొనే వీలు లేకుండా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో వాటి హక్కులు, రక్షణ కోసం గళమెత్తడమే మా లక్ష్యం అంటారు బర్డ్ వాచర్స్. పక్షుల పరిరక్షణకు పెద్దగా ఏమీ చేయాల్సిన పనిలేదని... ప్రతి ఇంట్లో ఓ చెట్టు పెంచితే చాలనేది వీరి అభిప్రాయం. ప్రస్తుతం 350 మంది సభ్యులున్న ఈ సొసైటీలో చేరాలంటే జ్ట్టిఞ://ఠీఠీఠీ.ఛట్చఞ.జీ/ను బ్రౌజ్ చేయవచ్చు.