కవ్వాల్‌లో బర్డ్‌వాక్–పక్షులను కెమెరాలో బంధించిన వాచర్స్
జన్నారం: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో ఆదివారం బర్డ్‌వాక్ ఉల్లాసంగా సాగింది. బిహార్, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల నుంచి 15 మంది బర్డ్ వాచర్లు వచ్చారు. శనివారం జన్నారం చేరుకున్న బర్డ్ వాచర్లకు రేంజ్ పరిధిలోని బైసన్‌కుంటలో రాత్రి బస కలి్పంచారు. ఆదివారం ఉదయమే సమీపంలోని అడవంతా తిరుగుతూ పక్షులను తిలకించారు. అరుదైన వివిధ రకాల పక్షులను కెమెరాలో బంధించారు.
కొందరు బైనాక్యులర్‌తో పక్షులను తిలకించి మురిసిపోయారు. సఫారి ద్వారా మల్యాల వాచ్ టవర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కూడా పక్షులను ఫొటోలు తీశారు. ఉన్నతాధికారులు, జిల్లా అటవీశాఖ అధికారి శివ్‌ఆశి‹Ùసింగ్ ఆదేశాల మేరకు జన్నారం అటవీ రేంజ్ అధికారి సుష్మారావు అధ్వర్యంలో బర్డ్‌వాక్ జరిగింది. ఇందన్‌పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ బర్డ్‌వాక్‌ను పరిశీలించారు. డీఆర్వో తిరుపతి, సిబ్బంది సౌకర్యాలను ఏర్పాటు చేశారు. బర్డ్‌వాక్‌లో 60 రకాల పక్షులను గుర్తించినట్లు పలువురు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment