టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా కవిత | kalvakuntla kavitha Elected As Honorary President Of TBGKS | Sakshi
Sakshi News home page

టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా కవిత

Published Mon, Feb 15 2021 2:27 AM | Last Updated on Mon, Feb 15 2021 5:36 AM

kalvakuntla kavitha Elected As Honorary President Of TBGKS - Sakshi

సాక్షి, శ్రీరాంపూర్‌(మంచిర్యాల): సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా బి. వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం శ్రీరాంపూర్‌ డివి జన్‌ సింగరేణి ఆఫీసర్స్‌ క్లబ్‌లో కంపెనీస్థాయి యూనియన్‌ ప్రతినిధుల సమావేశం జరిగింది. ముఖ్యాతిథిగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు హాజరయ్యారు. పలువురు నేతలు యూనియన్‌ ఆధ్వర్యంలో సాధించిన హక్కులను వివరించారు. తర్వాత సంఘం ఎన్నికలు నిర్వహించారు. చర్చల తర్వాత పూర్తి కమిటీని  ప్రకటిస్తామన్నారు.  కార్యక్రమంలో నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈసంపల్లి ప్రభాకర్, యూనియన్‌ ఉపాధ్యక్షుడు బి. సంపత్‌కుమార్, కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.వీరభద్రయ్య, రీజియన్‌ కార్యదర్శి మంద మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement