సాక్షి, మంచిర్యాల : డెంగీ విషజ్వరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబంలోని మూడు తరాలను డెంగీ కబళించింది. డెంగీ బారినపడి 15 రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న మంచిర్యాలకు చెందిన రాజ గట్టు డెంగీతో మృతిచెందాడు. ఆ తర్వాత 27వ తేదీన అతని కూతురు కూడా డెంగీ బారినపడి మరణించారు. తాజాగా అతని భార్య సోని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గర్భవతి అయిన సోని మంగళవారం మగశిశువుకు జన్మనిచ్చారు. అయితే డెంగీతో పోరాడుతూ బుధవారం 2.30 గంటల ప్రాంతంలో సోని మృతిచెందారు. అయితే అంతకుముందే.. రాజ గట్టు తాత లింగయ్య డెంగీతో మరణించాడు. డెంగీ బారినపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందడంతో.. మంచిర్యాల జిల్లా ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలో డెంగీ విస్తరిస్తోంది. బుధవారం జిల్లాలోని భీమారం మండలం కొత్తపల్లికి చెందిన రాజశ్రీ అనే వివాహిత డెంగీ జ్వరంతో మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment