
సాక్షి, మంచిర్యాల: కేసుల భయంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. కర్ణమామిడికి చెందిన కొట్టె వీరయ్య ఆర్‌కే–6 గనిలో సపోర్ట్‌మెన్ కార్మికుడు. ఇతని కుమారులు సంతోష్, చంద్రమౌళి పదెకరాల్లో వరి సాగు చేశారు.
గ్రామానికి చెందిన మురికి నీరు, చెత్తాచెదారం అంతా కాలువల ద్వారా వరి కోతలకు వచ్చిన పొలంలోకి చేరుతుండటంతో మురుగు నీరు పొలంలోకి రాకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో ఆ నీరు మరొకరి పొలంలోకి వెళ్లడంతో ఆ పొలం యజమాని హాజీపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ఆదివారం ఉదయం స్టేషన్‌కు పిలిపించి వివరాలు ఆరా తీశారు. ఈ కుటుంబంపై ఇప్పటికే ఓ భూ వివాదంతో పాటు ఇటీవల పంచా యతీ కార్యదర్శి విధులను అడ్డుకున్న కేసులున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రౌడీషీట్ తెరుస్తామనడంతో వారు అరుస్తూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. ఎస్సై వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment