'మా నీళ్లు మాకే' : కోదండరాం | Kodandaram Demands For Project At Tummidihatti | Sakshi
Sakshi News home page

'మా నీళ్లు మాకే' : కోదండరాం

Published Mon, Aug 26 2019 11:02 AM | Last Updated on Mon, Aug 26 2019 11:02 AM

Kodandaram Demands For Project At Tummidihatti - Sakshi

జిల్లా కేంద్రంలో అఖిలపక్ష సమావేశం హాజరైన టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం

సాక్షి, మంచిర్యాల: మా నీళ్లు మాకే అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్‌లో జలసాదన సమితి నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం హాజరై మాట్లాడారు. తూర్పు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహిత నదిపై బ్యారెజీ నిర్మాణం చేయకుండా కాళేశ్వరం వద్ద నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.

కుమురం భీం జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు తాగు, సాగు నీరందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. ‘మా నీళ్లు మాకే’ అనే నినాదంతో జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్‌లో జలసాధన సమితి నాయకులు, అన్ని రాజకీయ పార్టల నాయకులు, యువలకుతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం హాజరయ్యారు.

ప్రజా సంఘాల నాయకులతో కోదండరాం

నాయకులు మాట్లాడుతూ.. తూర్పు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహితనదిపై బ్యారెజీ నిర్మాణం చేయకుండా కాళేశ్వరం వద్ద బ్యారెజీ నిర్మాణం చేసి మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు జిల్లాలకు నీరు రాకుండా పోయిందని వారు వాపోయారు.  జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కుమురం భీం, మంచిర్యాల జిల్లాలోని ప్రజలకు సాగునీరు లేక  కేవలం వర్షాధార పంటలు సాగుచేసుకుంటున్నారని, ప్రాజెక్టు నిర్మాణం చేపడితే వారి పంటలకు నీరందుతుందన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేశామని కానీ ఇప్పుడు రెండు జిల్లాలకు నీళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వంలో పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు.

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని కేవలం హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు నీటిని తరలించడానికే నిర్మించారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో తుమ్మిడి హెట్టి వద్ద 25 వేల కోట్లతో 70 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ పనులు ప్రారంభించారని, మరో 30 కిలోమీటర్ల పనులు పనులు చేస్తే పూర్తయ్యే కాలువ పనులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని వివర్శించారు. కేవలం కమీషన్‌ల కోసమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టిందని ఆరోపించారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చే సిందనే సాకుతో తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించకుండా ఇక్కడి రైతులను మోసం చేసిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు వద్ద బ్యారెజీ నిర్మాణం చేసి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెకులో కలుపవచ్చన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా ముందుకు రావాలని రెండు జిల్లాలకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని తీర్మానించారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement